Begin typing your search above and press return to search.

ఎయిర్ టెల్ కు మొట్టికాయ వేసిన ఫోరం!

By:  Tupaki Desk   |   19 Jun 2019 5:39 AM GMT
ఎయిర్ టెల్ కు మొట్టికాయ వేసిన ఫోరం!
X
పేరుకు ప్ర‌ముఖ‌మైనవే కానీ.. స‌ద‌రు సంస్థ‌లు అందించే సేవ‌ల నాణ్య‌త కొన్నిసంద‌ర్భాల్లో దారుణంగా ఉంటుంది. అలాంటి సంస్థ‌ల విష‌యంలో వినియోగ‌దారుల ఫోరం ఎప్ప‌టిక‌ప్పుడు బాధిత వినియోగ‌దారుల‌కు ఊర‌ట క‌లిగించేలా తీర్పులు ఇస్తుంటాయి. తాజాగా అలాంటి ఉదంత‌మే ఒక‌టి చోటు చేసుకుంది. దిగ్గ‌జ మొబైల్ ఆప‌రేట‌ర్ ఎయిర్ టెల్ కు తాజాగా ఫోరం ఫైన్ వేస్తూ నిర్ణ‌యం తీసుకుంది.

హైద‌రాబాద్‌లోని మ‌ణికొండ వాణి ఇచ్చిన ఫిర్యాదుకు ఫోరం స్పందించింది. మ‌ణికొండ‌లో ఉండే స‌చిన్ వ‌న్ రావు మాస్కే అనే వ్య‌క్తి మ‌హారాష్ట్ర నుంచి హైద‌రాబాద్ కు బ‌దిలీ మీద వ‌చ్చారు. త‌న మొబైల్ ఫోన్ పోస్ట్ పెయిడ్ సేవ‌ల్ని నిలిపివేయాల్సిందిగా ఎయిర్ టెల్ కు ద‌ర‌ఖాస్తు చేశారు. అయినా.. మూడేళ్లు బిల్లులు పంప‌టంతో పాటు.. ఎల‌క్ట్రానిక్ క్లియ‌రింగ్ సిస్టం ద్వారా అత‌డి బ్యాంకు ఖాతా నుంచి బిల్లు మొత్తాన్ని ఎయిర్ టెల్ బ‌దిలీ చేసుకుంది.

దీంతో.. షాక్ తిన్న స‌ద‌రు వినియోగ‌దారుడు త‌న‌కు జ‌రిగిన అన్యాయంపై వినియోగ‌దారుల హ‌క్కుల ఫోరంను ఆశ్ర‌యించారు. త‌న వ‌ద్ద‌నున్న ఆధారాల్ని స‌మ‌ర్పించారు. ఈ కేసును ప‌రిశీలించిన ఫోరం.. బాధితుడికి రూ.25వేల ప‌రిహారం.. 2013 ఏప్రిల్ 30 త‌ర్వాతి కాలానికి సంబంధించి వ‌సూలు చేసిన మొత్తానికి 9 శాతం వ‌డ్డీతో స‌హా చెల్లించాల‌ని ఆదేశాలు జారీ చేసింది.