Begin typing your search above and press return to search.

ఐశ్వర్యారాయ్ వైటేనేట.. బ్లాక్ లిస్టుపై గుస్సా

By:  Tupaki Desk   |   4 April 2016 9:26 AM GMT
ఐశ్వర్యారాయ్ వైటేనేట.. బ్లాక్ లిస్టుపై గుస్సా
X
నల్లధన కుబేరుల జాబితాలో తన పేరు రావడంపై బాలీవుడ్ సుందరి - మాజీ మిస్ వరల్డు ఐశ్వర్యా రాయ్ బచ్చన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బ్లాక్ మనీ కుంభకోణంలో తన పేరుండటం షాక్ ను కలిగించిందని, ఇదంతా పచ్చి అబద్ధమని ఆమె ఆరోపించింది. ఐశ్వర్య మీడియా సలహాదారు నుంచి ఆమె తరఫున కొద్దిసేపటి కిందట ఒక ప్రకటన వెలువడింది. అయితే... నేల్లధనం జాబితాలో తన పేరు ఉండడాన్ని ఖండించిన ఐశ్వర్య మామా అమితాబ్ బచ్చన్ విషయం మాత్రం ప్రస్తావించలేదు. ఆ జాబితాలో అమితాబ్ పేరు కూడా ఉన్న విషయం తెలిసిందే.

కాగా, ఈ జాబితాలో ఇండియాకు చెందిన 500 మంది పేర్లుండగా 140 మందికి పైగా రాజకీయ నాయకులు, 200 మంది వరకూ వ్యాపారవేత్తలు, 12 మంది రాష్ట్రాధినేతలు, సెలబ్రిటీల పేర్లు ఉన్నాయి.

2005లో అమిక్ పార్టనర్సు లిమిటెడ్ పేరిట బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్ లో ఐశ్వర్య కుటుంబసభ్యులు ఓ కంపెనీ ఏర్పాటు చేశారు. అందులో ఐశ్వర్య తండ్రి, సోదరుడు డైరెక్టర్లుగా ఉన్నారు. అనంతరం ఐశ్వర్య కూడా అందులో డైరెక్టరుగా చేరారు. 2008లో ఈ కంపెనీని మూసేశారు.

ఇక అమితాబ్ విషయానికొస్తే ఆయన విదేశాల్లో నాలు కంపెనీలు ఏర్పాటు చేశారు. వర్జిన్ ఐలాండ్ - బహమాస్ లో 1993 నుంచి ఇవి ఉన్నాయి. వీటిలో మూల ధనం తక్కువగా ఉన్న లావాదేవీలు భారీగా ఉన్నట్లు గుర్తించారు. మూలధనం 5 వేల డాలర్ల నుంచి 50 వేల డాలర్ల మధ్యలో ఉన్నా లావాదేవీలు మాత్రం లక్షల డాలర్లలో జరిగాయట. అదీ కథ.