Begin typing your search above and press return to search.
ఐశ్వర్య ఆత్మహత్య కారణమదే. భోరుమన్న తల్లిదండ్రులు
By: Tupaki Desk | 9 Nov 2020 5:49 PM GMTఉన్నత చదువులు చదవాలని తలించి కరోనా లాక్ డౌన్ వేళ స్కాలర్ షిప్ అందక.. తల్లిదండ్రులకు భారం కాక డిగ్రీ విద్యార్థిని ఐశ్వర్య ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆమె తల్లిదండ్రులు తాజాగా కూతురు ఆత్మహత్యపై వాపోయారు. ఆర్థిక ఇబ్బందులే తమ కూతురుని పొట్టనపెట్టుకున్నాయని ఐశ్వర్య తల్లిదండ్రులు శ్రీనివాస్ రెడ్డి-సుమతి ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్ లైన్ క్లాసులు వినడానికి కనీసం తమ కూతురికి ఫోన్ కూడా కొనివ్వలేకపోయామని కన్నీరుమున్నీరయ్యారు.
షాద్ నగర్ కు చెందిన ఐశ్వర్య ఢిల్లీలోని శ్రీరామ్ కాలేజీలో యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిగ్రీ చదువుతోంది. అయితే ఈ ఏడాది నుంచి ఐశ్వర్యకు స్కాలర్ షిప్ రాలేదు. హైదరాబాద్ వచ్చి చదువుల కోసం తల్లిదండ్రులను అడగలేక.. ఖర్చులు భరించలేక సూసైడ్ చేసుకుంది.
కూతురు ఆత్మహత్యపై ఆమె తల్లిదండ్రులు వాపోయారు. ఐశ్వర్య టాప్ గా నిలిచిందని.. ఎందరో అండగా ఉంటామని కొద్దిరోజులకే ముఖం చాటేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కూతర్ని ఐఏఎస్ చేయడం కోసం చివరకు మా ఇంటిని కూడా తాకట్టు పెట్టామని.. ఆన్ లైన్ క్లాసుల కోసం ఫోన్ కొనివ్వలేకపోయామని.. చనిపోయే ముందు కూడా ఐశ్వర్య అందరితో మాట్లాడి చనిపోయిందని వారు భోరుమన్నారు. స్కాలర్ షిప్ రాకపోవడమే ఐశ్వర్యను కృంగదీసిందని.. మాకొచ్చిన బాధ ఏ తల్లిదండ్రులకు రావద్దని వారు బోరున విలపించారు.
ఆర్థిక ఇబ్బందులు.. చదవాలనే లక్ష్యం నెరవేరకపోవడం.. ఆదుకోవాలనుకుంటున్న వారు హ్యాండ్ ఇవ్వడంతో తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని ఐశ్వర్య తల్లిదండ్రులు వాపోయారు. మొత్తంగా ఓ చదువుల తల్లి ఇలా అర్థాంతరంగా చనిపోవడం విషాదం నింపింది.