Begin typing your search above and press return to search.

బాబూ... జైన్ మాట‌లు మీవేగా!

By:  Tupaki Desk   |   24 Jun 2017 6:10 AM GMT
బాబూ... జైన్ మాట‌లు మీవేగా!
X
టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు అబ‌ద్ధాలు ఆడుతున్నార‌ని విప‌క్ష నేత‌ - వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నిత్యం ఆరోపిస్తూనే ఉన్నారు. అటు శాస‌న‌స‌భా స‌మావేశాల్లోనే కాకుండా బ‌య‌ట కూడా ఎక్క‌డ ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌కు సంబంధించి జ‌గ‌న్ మాట్లాడినా... బాబు అబ‌ద్ధాలు ఆడుతున్నార‌నే మాట‌ను జ‌గ‌న్ చెప్ప‌డం మ‌నం వింటూనే ఉన్నాం. విప‌క్ష నేత హోదాలో అధికార ప‌క్షంపైనే కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రిపై కూడా జ‌గ‌న్ ఈ త‌ర‌హా ఆరోప‌ణ‌లు చేయ‌డం మామూలే క‌దా అని మ‌నం స‌రిపెట్టుకున్నా... బాబు మాత్రం అబ‌ద్ధాలాడుతున్నార‌ని చెప్పేందుకు ఇప్పుడు ప‌క్కా ఆధారం దొరికేసింది. చంద్ర‌బాబును అబ‌ద్ధాల కోరుగా జ‌గ‌న్ అభివ‌ర్ణిస్తున్న వైనానికి నిలువెత్తు నిద‌ర్శ‌నంలా నిలిచే ఈ విష‌యం ఇప్పుడు స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఇక అస‌లు విష‌యంలోకి వ‌స్తే... వ‌చ్చే ఏడాది నుంచి లేదంటే... అటొచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో విద్యుత్ చార్జీల‌ను పెంచ‌మ‌ని చంద్ర‌బాబు ఎప్ప‌టినుంచో చెప్పుకుంటూ వ‌స్తున్నారు. ఇటీవ‌ల రెండు సంద‌ర్భాల్లో విద్యుత్ చార్జీల‌ను పెంచకుండా ఉండటంతోనే ఆగిపోమ‌ని... విద్యుత్ చార్జీల‌ను క్ర‌మంగా త‌గ్గించేస్తామ‌ని కూడా ఆయ‌న చెప్పారు. విద్యుత్ చార్జీల‌ను ఎప్పుడెప్పుడు పెంచుదామా? అని ఎదురు చూస్తున్న ప్ర‌భుత్వాల పాల‌న‌లో ఉన్న మ‌న‌కు చంద్ర‌బాబు మాట‌లు నిజంగానే ఇంపుగా వినిపించాయి. అయితే ఆ మాట‌ల‌న్నీ శుద్ధ అబ‌ద్ధాల‌ని నిన్న కేంద్ర ప్ర‌భుత్వం సాక్షిగా తేలిపోయాయి. నిన్న కేంద్ర ఇంధ‌న శాఖ ఆధ్వ‌ర్యంలో ఢిల్లీలో *ఉద‌య్‌* ప‌థ‌కంపై జ‌రిగిన స‌మీక్షా స‌మావేశానికి ఏపీ ప్ర‌తినిధిగా రాష్ట్ర ఇంధ‌న శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి అజ‌య్ జైన్ హాజ‌ర‌య్యారు. త్వ‌ర‌లో ఉద‌య్ నిబంధ‌న‌ల అమ‌లులోకి రానున్న నేప‌థ్యంలో ఆయా రాష్ట్రాల స‌న్న‌ద్ధ‌త‌ను స‌మీక్షించేందుకే కేంద్రం ఈ స‌మావేశాన్ని ఏర్పాటు చేసింది.

ఉద‌య్ నిబంధ‌న‌లు అమ‌లు చేస్తే... విద్యుత్ చార్జీల‌ను ఏటా ఐదు శాతం మేర పెంచుకుంటూ పోవాలి. ఇదే విష‌యాన్ని కేంద్రం ఆరా తీయ‌గా... అజ‌య్ జైన్ మైకందుకుని రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్యల‌ను ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా విన్న‌వించారు. వ‌చ్చే ఏడాది నుంచే ఉద‌య్ నిబంధ‌న‌ల‌ను అమ‌లు చేసేందుకు చంద్ర‌బాబు స‌ర్కారు సిద్ధంగా ఉంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఆ నిబంధ‌న‌ల మేర‌కు ఏటా ఐదు శాతం విద్యుత్ చార్జీల‌ను పెంచేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామ‌ని కూడా ఆయ‌న చెప్పారు. విద్యుదుత్ప‌త్తి వ్య‌యం త‌గ్గింపున‌కు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని, స‌ర‌ఫ‌రా న‌ష్టాల‌ను కూడా త‌గ్గించుకునే విష‌యంపై దృష్టి సారించామ‌ని ఆయ‌న చెప్పారు. వెర‌సి విద్యుత్ చార్జీలు త‌గ్గిస్తామ‌ని చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన మాట శుద్ధ అబ‌ద్ధ‌మ‌ని, బాబు స‌ర్కారులో కీల‌క అధికారిగా ఉన్న అజ‌య్ జైన్ చెప్పేశారు. మ‌రి దీనిపై చంద్రబాబు ఏమంటారో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/