Begin typing your search above and press return to search.
ఏపీకి రూ.5607 కోట్లు .. ఎలా?
By: Tupaki Desk | 11 April 2016 4:00 AM GMTఅప్పు కావాల్సిన వారు ఎవరైనా తామే వెళ్లి ప్రయత్నం చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ లో సీన్ రివర్స్ అవుతోంది. ఏపీకి అప్పులు ఇస్తామని అంతర్జాతీయ సంస్థలు ముందుకువస్తున్నాయి. విద్యుత్ ను ఆదా చేసేందుకు ఆంధ్రప్రదేశ్ లో అమల్లో ఉన్న పథకాలకు భారీ ఎత్తున ఆర్ధిక రుణాలను ఇచ్చేందుకు నాలుగు అంతర్జాతీయ ఏజన్సీలు ముందుకు వచ్చాయి. ఈ ఏజన్సీలు రూ. 5607 కోట్ల నిధులను సమకూర్చనున్నాయి. ఈ వివరాలను రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్ వెల్లడించారు.
ఆసియా అభివృద్ధి బ్యాంకు రూ.1331 కోట్లు - జర్మన్ కు చెందిన కెఎఫ్ డబ్ల్యు బ్యాంకు రూ.1900 కోట్లు - ఫ్రెంచి అభివృద్ధి ఏజన్సీ రూ.380 కోట్లు - ప్రపంచ బ్యాంకు రూ.1996 కోట్లు రుణం ఇచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకరించాయి. దీనికి సంబంధించిన విధి విధానాలు త్వరలో ఖరారు కానున్నాయి. విద్యుత్ ఆదా చేసేందుకు ఏపీ ప్రభుత్వం విస్తృతంగా అమలు చేస్తున్న ఎల్ ఇడి టెక్నాలజీ - ఎనర్జీ ఎఫీషియంట్ ఫ్యాన్ ప్రోగ్రాంలను కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రశంసించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫోన్ చేసి అభినందించారు.
2017 నాటికి విద్యుత్ ఆదాచేయడంలో ఏపీ అగ్రగామిగా ఉండాలని, దీనికి కార్యాచరణ ప్రణాళిక ఖరారు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. విశాఖపట్నంలో ఎల్ ఇడి స్కీంను అమలు చేయడం వల్ల ఏటా రూ.4 కోట్లు ఆదా అవుతోంది. వచ్చే మూడేళ్లలో రైతుల నుంచి పైసా వసూలు చేయకుండా 15 లక్షల విద్యుత్ పంపుసెట్లను ఉచితంగా అమర్చాలని తాజాగా చంద్రబాబు ఆదేశించారు. మరోవైపు రాష్ట్రంలోని 34 స్థానిక సంస్థల్లో ఎల్ ఇడి విద్యుద్దీపాలను అమర్చుతున్నారు. ఈ ఏడాది జూన్ నాటికి అన్ని మున్సిపాలిటీల్లో ఈ కార్యక్రమం పూర్తవుతుంది. దీంతో విద్యుత్ ఆదాలో ఏపీ మరింత ముందుకుపోతుంది.