Begin typing your search above and press return to search.
ఒక్క జీవోతో ఇద్దరిని సంతృప్తి పర్చిన బాబు
By: Tupaki Desk | 28 Feb 2017 4:46 AM GMTఎవరినీ నొప్పించకూడదన్న పేరుతో.. అందరిని సంతృప్తి పరిచే కార్యక్రమానికి తెర తీసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వినూత్న రీతిలో వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయంఅందరిని ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది. రాష్ట్ర ప్రయోజనాల కంటే.. వ్యక్తులను సంతృప్తి పర్చటమే లక్ష్యంగా బాబు తీరు ఉంటుందన్నవిమర్శల్ని లైట్ తీసుకున్న ఆయన ఒక్క జీవోతో ఇద్దరు సీనియర్ అధికారుల్ని సంతృప్తిపరిచారు. ఏపీకి సీఎస్ పోస్ట్ ఖాళీగా ఉందన్న విషయం తెలిసిందే. ఒక రాష్ట్రానికి గుండెకాయ లాంటి సీఎస్ పోస్ట్ విషయంలో ముఖ్యమంత్రులు ఆచితూచి నిర్ణయం తీసుకుంటారు.
నెల రోజులకు.. రెండు నెలలకు రిటైర్ అయ్యే వారి కారణంగా కలిగే లాభం కంటే.. నష్టమే ఎక్కువన్న వాదనను పలువురు వ్యక్తం చేస్తుంటారు. దీనికి తోడు.. అదేపనిగా కీలక అధికారుల్ని మార్చటం పాలన మీద ప్రభావం చూపుతుందన్న అభిప్రాయాన్నిపలువురు వ్యక్తం చేస్తుంటారు. తాజా వ్యవహారమే తీసుకుంటే.. ఏపీ సీఎస్ గా అజయ్ కల్లంను ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదేమీ కొత్త ముచ్చట కాదు. కానీ.. కొత్త ముచ్చటే. ఎలానంటే.. కల్లంకు సీఎం బాధ్యతలు అప్పగించిన పక్షంలో నెల వ్యవధిలోనే ఆయన రిటైర్మెంట్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే ప్రత్యేక అధికారాలతో మరో ఆర్నెల్లు సర్వీస్ పొడిగించొచ్చు.
ఇలాంటి వాటిని కేంద్రం ఇప్పుడు అంగీకరించని నేపథ్యంలో.. కేవలం నెల కోసం కల్లంకు పగ్గాలు అప్పగించాలా? అన్నది ప్రశ్నగా మారింది. అదే సమయంలో ఆయన తర్వాత సీనియర్ అయిన దినేష్ కుమార్ కు బాధ్యతలు అప్పగిస్తారన్న ప్రచారం జోరుగా సాగింది. ఈ ఇద్దరి మధ్య నెలకొన్న పోటీ.. ఇరువురు ఎవరికి వారుగా ప్రయత్నాలు చేసుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన చంద్రబాబు.. ఇరువురితో భేటీ జరిపారు. ఇరువురి వాదనలు విన్న ఆయన.. ఇద్దరిని కాదనలేకపోయారు. అంతిమంగా ఆసక్తికర నిర్ణయం తీసుకున్నారు.
దీంతో..ఒకే జీవో మీదన ఇద్దరు సీఎస్ లను నియమిస్తూ ఆసక్తిక నిర్ణయం తీసుకున్నారు. అంటే.. అజయ్ కల్లం తొలుత సీఎస్ గా (బుధవారం నుంచి) బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన మార్చి చివరి వరకూ అంటే.. మార్చి 31 వరకూ సీఎస్ గా కొనసాగుతారు. ఆ తర్వాత ఆయన స్థానంలో దినేశ్ కుమార్ బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ నిర్ణయం కారణంగా సీఎస్ పదవి కోసం పోటీ పడుతున్న ఇద్దరు ఉన్నతాధికారుల్ని బాబు సంతృప్తి పర్చినట్లుగా చెప్పాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/