Begin typing your search above and press return to search.
వైరస్ పై కేంద్రం రాష్ట్రాలకు హెచ్చరిక: మార్గదర్శకాలు పాటించాల్సిందే..!
By: Tupaki Desk | 21 May 2020 4:33 PM GMTనాలుగో దశ లాక్‌డౌన్ కొనసాగుతున్నా దేశంలో ఆ మహమ్మారి వైరస్ విజృంభిస్తూనే ఉంది. ప్రస్తుతం లాక్‌డౌన్ నిబంధనల తొలగింపు.. ఆంక్షల సడలింపులతో ఆ వైరస్ తీవ్రంగా వ్యాపించే ప్రమాదం ఉందని అందరూ భావిస్తున్నారు. ఐసీఎంఆర్ కూడా ఇదే విషయాన్ని తెలిపింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు లేఖ విడుదల చేసింది. తాము ఇచ్చిన మార్గదర్శకాలు, నిబంధనలు పాటించాలని సూచించింది. ఊహించిన దానికంటే వైరస్ వేగంగా ప్రబలుతోందని.. దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం ఉందని కేంద్రం తెలిపింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా రాష్ట్ర ప్రభుత్వాలకు గురువారం లేఖ రాశారు. అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్‌లకు లేఖ రాశారు. కేంద్ర హోం శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను పాటించకపోతే ఇబ్బందులు తప్పవని ఈ సందర్భంగా లేఖలో హెచ్చరించారు.
ఆ లేఖలో.. హోం శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను కొన్ని ప్రాంతాలలో ఉల్లంఘిస్తున్నారని తెలిపింది. వైరస్ ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాలు అన్ని మార్గదర్శకాలు కచ్చితంగా.. కఠినంగా అమలు చేయాలని సూచించింది. మార్గదర్శకాలను అమలు చేయడానికి అవసరమైన అన్ని చర్యలు స్థానిక అధికారులు తీసుకోవాలి అని స్పష్టం చేసింది. ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో కేంద్ర నిబంధనలు, మార్గదర్శకాలు అమలు చేయకపోవడం, ప్రజా రవాణా, విమానాలు, రైళ్ల రాకపోకలు ప్రారంభం కావడంతో అప్రమత్తం కావాలని రాష్ట్రాలకు సూచించింది. ఈ సూచనలను పాటించని రాష్ట్రాలు తీరు మార్చుకోవాలని హోం శాఖ కార్యదర్శి తన లేఖలో పేర్కొన్నారు.