Begin typing your search above and press return to search.
‘జ్ఞానవాపి’ అప్డేట్: లీకు ఆరోపణలతో వేటు.. ఫిర్యాదు చేసినోడికి పట్టం
By: Tupaki Desk | 18 May 2022 3:32 AM GMTసున్నితమైన అంశాల విషయంలో కీలక బాధ్యతలు పోషిస్తున్న వారు ఆచితూచి స్పందించాల్సి ఉంటుంది. చిన్న తప్పు జరిగినా దానికి చెల్లించాల్సిన మూల్యం భారీగా ఉంటుంది. తాజాగా అలాంటిదే జరిగింది. దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన ‘జ్ఞానవాపి’ మసీదు వివాదానికి సంబంధించి తాజాగా అడ్వొకేట్ కమిషనర్ అజయ్ మిశ్రాపై వేటు పడింది. ఆయన స్థానంలో ఆరోపణలు చేసిన వారికే పట్టం కట్టటం విశేషం.
వారణాసిలోని ‘జ్ఞానవాపి’ మసీదు ప్రాంగణంలో శివలింగం ఉందని హిందూ వర్గాలు.. కాదని మసీద్ కమిటీ వాదిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వివాదానికి పుల్ స్టాప్ పెట్టేందుకు ఒక వీడియో గ్రాఫర్ తో మసీదు ప్రాంగణాన్ని వీడియో షూట్ చేయాలని ఆదేశించటం తెలిసిందే. వీడియో షూట్ అనంతరం.. కొలనులో శివలింగం ఉందంటూ కోర్టుకు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నట్లుగా మీడియాలో లీకు కావటం.. అది కాస్తా పెను సంచలనంగా మారటం తెలిసిందే. కోర్టుకు ఇచ్చిన నివేదికలో ఒక ‘అబ్జెక్టివ్’ ఉందని పేర్కొన్నారని.. కానీ ప్రచారంలోకి మాత్రం శివలింగం ఉందన్న వార్తలు జోరుగా వచ్చాయి.
అత్యంత రహస్యంగా ఉండాల్సిన నివేదిక మీడియాకు ఎలా పొక్కిందన్న ప్రశ్న తలెత్తింది. ఈ నేపథ్యంలో సర్వే కోసం నియమించిన కమిటీకి కీలక బాధ్యతలు పోషిస్తున్న అడ్వొకేట్ కమిషనర్ అజయ్ మిశ్రాపై వేటు వేస్తూ వారణాసి కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన స్థానంలో విశాల్ సింగ్ ను అడ్వొకేట్ కమిషనర్ గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటే.. సర్వే గురించి సమాచారాన్ని అజయ్ మిశ్రా లీకు చేశారంటూ కంప్లైంట్ చేసిన విశాల్ సింగ్ నే కొత్త అడ్వొకేట్ కమిషనర్ గా నియమించటం గమనార్హం. ఫిర్యాదు చేసిన వ్యక్తికే పట్టం కట్టాన్ని అజయ్ మిశ్రా ప్రశ్నిస్తున్నారు.
తనపై వేటు వేసిన వైనంపై స్పందించిన అజయ్ మిశ్రా.. తాను ఎలాంటి తప్పు చేయలేదని.. తనను మోసం చేశారని వాపోతున్నారు. విశాల్ సింగ్ మోసం చేశాడని.. ఇతరులను నమ్మే తన స్వభావం తన కొంప ముంచినట్లుగా ఆయన వ్యాఖ్యానించారు. అర్థరాత్రి 12 దాకా నివేదికను తాము రూపొందించామని.. విశాల్ చేసే కుట్రను తాను కనిపెట్టలేకపోయినట్లుగా చెప్పారు.
చాలా బాధగా అనిపించిందని.. సర్వే గురించి తాను ఎలాంటి సమాచారాన్ని బయటపెట్టలేదన్న అజయ్ మిశ్రా.. ఆయనో వీడియో గ్రాఫర్ ను నియమించుకొని.. అతని ద్వారా మీడియాకులీకులు ఇచ్చారని.. పుకార్లను ప్రచారం చేసి తనపై వేటు పడేలా చేశారన్నారు. తాను బాధ్యతగా నివేదికను సమర్పించినట్లుగా పేర్కొన్నారు. వీడియో గ్రాఫర్ చేసిన తప్పిదానికి తానేం చేస్తానని ప్రశ్నిస్తున్నారు అజయ్ మిశ్రా.
అయితే.. సున్నితమైన అంశానికి సంబంధించిన బాధ్యతను అప్పగించిన వేళలో.. అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆ విషయంలో జరిగే తప్పులకు తాను బాధ్యత వహిస్తానన్న విషయంలో అజయ్ మిశ్రా తనది తప్పు లేదని వాదించినా అర్థం లేదు. ఏమైనా తప్పు జరిగిందంటూ అజయ్ మిశ్రాపై వేటు పడటం ఒక ఎత్తు అయితే.. ఆ తప్పు జరిగిందని ఫిర్యాదు చేసిన విశాల్ సింగ్ నే ఆయన స్థానంలో నియమించటం ఈ మొత్తం ఎపిసోడ్ లో హైలెట్ అంశంగా వ్యాఖ్యానిస్తున్నారు.