Begin typing your search above and press return to search.

పార్ల‌మెంటు వేదిక‌గా వివ‌ర‌ణ ఇచ్చిన ఫేస్‌బుక్ ఇండియా ర‌థ‌సార‌థి

By:  Tupaki Desk   |   2 Sep 2020 4:30 PM GMT
పార్ల‌మెంటు వేదిక‌గా వివ‌ర‌ణ ఇచ్చిన ఫేస్‌బుక్ ఇండియా ర‌థ‌సార‌థి
X
సోష‌ల్ మీడియా దిగ్గ‌జం ఫేస్‌బుక్ దుమారం కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. బీజేపీకి గ‌త ఎన్నిక‌ల్లో వ‌త్తాసు ప‌లికిన‌ట్లు ఫేస్‌బుక్‌పై ఆరోప‌ణ‌లు వ‌చ్చిన వ‌చ్చిన తెలిసిందే. పార్ల‌మెంట‌రీ స్టాండింగ్ క‌మిటీ ఆన్ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ నోటీసుల నేప‌థ్యంలో ఫేస్‌బుక్‌ ఇండియా చీఫ్‌ అజిత్‌ మోహన్ హాజ‌రైయ్యారు. భావప్రకటన స్వేచ్ఛను సోషల్‌మీడియా దిగ్గజం హరిస్తోందనే విమర్శలకు ఆయ‌న స‌మాధానం ఇచ్చిన‌ట్లు స‌మాచారం.

బీజేపీ పార్టీకి వ‌త్తాసు ప‌లికిన ఫేస్‌బుక్ వ్య‌వ‌హారంలో పార్ల‌మెంట‌రీ స్థాయి విచార‌ణ జ‌ర‌గాల‌ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జ‌ర్న‌ల్‌.. భార‌త్‌పై ఇటీవ‌ల ఓ క‌థ‌నాన్ని రాసింది. దాంట్లో ఎన్నిక‌ల వేళ బీజేపీ నేత‌ల‌కు ఫేస్‌బుక్ స‌హ‌క‌రించిన‌ట్లు ఆరోప‌ణ‌లు చేసింది. ఆ ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఆ అంశంపై విచార‌ణ నిర్వ‌హించాల‌ని కాంగ్రెస్ పార్టీ ఫేస్‌బుక్ ఓన‌ర్ జుక‌ర్‌బ‌ర్గ్‌కు లేఖ రాసింది. ఆ లేఖ‌ను రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. అత్యంత చెమ‌టోడ్చి ప్రజాస్వామ్యాన్ని సాధించామ‌ని, అలాంటి నేల‌లో ప‌క్ష‌పాత‌, న‌కిలీ, విద్వేష‌పూరిత వార్త‌ల‌ను తాము అనుమ‌తించ‌బోమ‌ని రాహుల్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

అనంత‌రం పార్ల‌మెంట‌రీ స్టాండింగ్ క‌మిటీ ఆన్ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ నేత అయిన కాంగ్రెస్ నేత‌, ఎంపీ శ‌శిథ‌రూర్ .. ఫేస్‌బుక్‌కు స‌మ‌న్లు జారీ చేయ‌నున్న‌ట్లు ట్విట్ట‌ర్‌లో తెలిపారు. దీన్ని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే ఖండించారు. స్టాండింగ్ క‌మిటీ స‌భ్యుల అనుమ‌తి లేకుండా ఎంపీ శ‌శిథ‌రూర్ ఫేస్‌బుక్‌కు స‌మ‌న్లు జారీ చేయ‌లేరనీ ఎంపీ నిశికాంత్ దూబే తెలిపారు. అయితే కాంగ్రెస్ ఎంపీ శ‌శిథ‌రూర్‌కు.. తృణ‌మూల్ ఎంపీ మహువా మోయిత్రా అండ‌గా నిలిచారు. ఎంపీ శ‌శికి వ్య‌తిరేకంగా బీజేపీ ఎంపీలంతా లోక్‌స‌భ స్పీక‌ర్‌కు లేఖ రాయాల‌ని దూబా కోరారు. అనంత‌రం తాజా విచార‌ణకు జ‌రి‌గింది.

మ‌రోవైపు ఫేస్ బుక్ వివాదాన్ని బీజేపీ సైతం సీరియ‌స్‌గా తీసుకుంది. ఫేస్ ‌బుక్‌ ఇండియాలో సీనియర్‌ సిబ్బంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా ఇతర కేబినెట్‌ మంత్రులను దూషించారని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ఫేస్‌బుక్‌ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌కు లేఖ రాసిన మరుసటి రోజు ఎఫ్‌బీ అధికారి పార్లమెంటరీ కమిటీ ఎదుట హాజరయ్యారు.