Begin typing your search above and press return to search.

సీఏఏపై అజిత్ పవార్ కీలక వ్యాఖ్యలు ...

By:  Tupaki Desk   |   2 March 2020 7:30 AM GMT
సీఏఏపై అజిత్ పవార్ కీలక వ్యాఖ్యలు ...
X
మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి మహావికాస్ అఘాడీ పేరుతొ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏడాది కూడా తిరగకముందే అప్పుడే, మిత్ర పక్షాల మధ్య లుకలుకలు మొదలైయ్యాయి. ముఖ్యంగా పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) ఈ సంకీర్ణ ప్రభుత్వం మధ్య చిచ్చు పెడుతోంది. బీజేపీ తీసుకొచ్చిన సీఏఏకి శివసేన మద్దతు తెలుపుతుంటే , కాంగ్రెస్ మాత్రం వ్యతిరేకిస్తుంది. అయితే , దీని గురించి మూడు పార్టీలు కూడా కలిసి మాట్లాడాలని శరద్ పవార్ కొద్దిరోజుల క్రితం చెప్పగా ..దానికి భిన్నంగా తాజాగా అజిత్ పవార్ ఒక స్టేట్ మెంట్ ఇచ్చారు.

ముంబైలో నిర్వహించిన ఎన్‌ సీపీ పార్టీ కార్యకర్తల సమావేశం లో మాట్లాడిన అజిత్ పవార్ ..సీఏఏ వల్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆయన అన్నారు. సీఏఏ, ఎన్పీఆర్, ఎన్నార్సీలు ఎవరి పౌరసత్వాన్ని రద్దు చేయవని... వాటికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయడం అనవసరమని స్పష్టం చేశారు. అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఓ వైపు సీఏఏకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాడుతున్న నేపథ్యంలో, పవార్ వ్యాఖ్యలు కాక పుట్టిస్తున్నాయి.

ఇకపోతే ఇప్పటికే ప్రధాని మోదీతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే భేటీ అయ్యారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ సీఏఏపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని... దీనివల్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. దీంతో, సీఏఏకు శివసేన పూర్తి అనుకూలంగా ఉందనే విషయం స్పష్టమైంది. కూటిమిలోని మూడు పార్టీలు కూడా విభిన్నమైన అభిప్రాయాలతో ముందుకు సాగుతుండటంతో... ఏం జరగబోతోందో అర్థంకాక ప్రజలు కూడా ముందు ముందు ఏంజరుగుతుందో అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అలాగే ఇదే సందర్భం లో మహావికాస్ అఘాడీ ప్రభుత్వం కలిసికట్టుగానే పోటీ చేస్తుందని. ఎన్‌సీపీ కార్యకర్తలకు,మద్దతుదారులకు తమ భాగస్వామ్య పార్టీల పట్ల ఎలాంటి అపోహలు లేదా అపార్థాలు ఉండరాదని, రాబోయే రోజుల్లో కలిసి ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి అలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు అని అజిత్ చెప్పుకొచ్చారు. అయితే, శరద్ పవార్..మూడు పార్టీల నేతలు కలిసి ఈ విషయంపై చర్చించాలి అని చెప్పిన కోదిరోజుల్లోనే అజిత్ పవార్ కూడా సీఏఏకి అనుకూలంగా స్టేట్‌మెంట్స్ ఇవ్వడం ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చలకు దారితీస్తుంది.