Begin typing your search above and press return to search.
మళ్లీ కలిసిన ఫడ్నవీస్ - అజిత్ పవార్! ప్రభుత్వాన్ని కూల్చడానికా?
By: Tupaki Desk | 10 Dec 2019 8:27 AM GMTఇటీవలి మహారాష్ట్ర రాజకీయాల్లో రసవత్తర పరిణామాల్లో ప్రముఖంగా నిలిచిన పేర్లు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ లవి. అంత వరకూ దశాబ్దాలుగా రాజకీయంగా శత్రువులుగా చలామణి అయిన వీళ్లు ఎన్నికల తర్వాత చేతులు కలిపారు.
దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా, అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్సీపీని చీల్చి ఫడ్నవీస్ ప్రభుత్వాన్ని నిలబెడతానంటూ అజిత్ పవార్ బీజేపీతో చేతులు కలిపారప్పుడు. అయితే అజిత్ పవార్ కు అంత సీన్ లేకపోయింది!
కొన్ని గంటల సేపట్లోనే ఫడ్నవీస్ నాయకత్వంలోని ప్రభుత్వం పడిపోయింది. విశ్వాస పరీక్షకు సుప్రీం కోర్టు నుంచి ఆదేశాలు రాగానే.. అజిత్ పవార్ నీరుగారిపోయారు. ఉపముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి అసలు కథ అర్థమయ్యేలా చేశారు. ఆ పరిస్థితిని అర్థం చేసుకుని ఫడ్నవీస్ కూడా సీఎం పదవికి రాజీనామా చేసి తప్పుకున్నారు.
అయితే ఈ కథ అసలు ఎందుకు నడిచిందనే అంశంపై మిస్టరీనే. అజిత్ పవార్ ను శరద్ పవార్ వ్యూహాత్మకంగా ప్రయోగించారనే అనుమానాలూ లేకపోలేదు.
మరి అదేం జరిగిందో కానీ.. దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ లు మళ్లీ కలిసి కనిపించారు. అయితే ఈ సమావేశానికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని వారు అంటున్నారు. ఒక పెళ్లిలో వీరిద్దరూ పక్కపక్క కూర్చుని కనిపించారు. ఆ ఫొటోలు వైరల్ గా మారాయి.
అనంతరం వీరు మాట్లాడుతూ తాము రాజకీయాల గురించి అస్సలు చర్చించుకోలేదని, వాతావరణం గురించి, పెళ్లి గురించి మాత్రమే తాము మాట్లాడుకున్నట్టుగా చెప్పారు. ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాలు ఏవీ చేయలేదని ఇలా వివరణ ఇచ్చుకున్నారు!