Begin typing your search above and press return to search.

సినిమాకు వెళ్లనివ్వలేదని తండ్రిపై కొడుకు దారుణం

By:  Tupaki Desk   |   10 Jan 2019 6:58 AM GMT
సినిమాకు వెళ్లనివ్వలేదని తండ్రిపై కొడుకు దారుణం
X
తమిళనాట హీరోలపై అభిమానం కాస్త అతిగా ఉంటుందని గతంలో పలు సంఘటనల ద్వారా నిరూపితం అయ్యింది. తమ అభిమాన హీరో సినిమాను మొదటి రోజు మొదటి ఆట చూడాలని ప్రతి ఒక్క వీరాభిమాని అక్కడ అనుకుంటూ ఉంటారు. తమిళనాట హీరోల ఫ్యాన్స్‌ మద్య వార్‌ కూడా భారీగా ఉంటుంది. నేడు తమిళనాట ఇద్దరు బడా స్టార్స్‌ అయిన రజినీకాంత్‌, అజిత్‌ ల సినిమాలు విడుదల అయ్యాయి. దాంతో రాష్ట్రం మొత్తం కూడా హంగామా హంగామా ఉంది.

ఇలాంటి సమయంలో వేలూరుకు చెందిన అజిత్‌ కుమార్‌ అనే వ్యక్తి తన అభిమాన నటుడు అజిత్‌ ‘విశ్వాసం’ చిత్రాన్ని మొదటి రోజు మొదటి ఆట చూడాలనుకున్నాడు. మొదటి రోజు మొదటి ఆట టికెట్టుకు డబ్బులు ఇవ్వమంటూ అజిత్‌ కుమార్‌ తన తండ్రి పాండియరాజన్‌ ఇవ్వలేదు. తండ్రి సినిమాకు వెళ్లేందుకు ఒప్పుకోక పోవడంతో అజిత్‌ కుమార్‌ కోపంతో రగిలి పోయాడు. తనను సినిమాకు వెళ్లకుండా చేశాడంటూ తండ్రిపై కోపంతో ఏకంగా పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. దాంతో తీవ్ర గాయాలైన పాండియరాజన్‌ హాస్పిటల్‌ లో చేరాడు.

కేసు నమోదు చేసిన పోలీసులు అజిత్‌ కుమార్‌ ను అరెస్ట్‌ చేశారు. హీరోలపై అభిమానంతో మరీ ఇంత దారుణంగా ప్రవర్తించడం తమిళ ఫ్యాన్స్‌ కే చెల్లింది. ఎంతైనా మన తెలుగు ఫ్యాన్స్‌ అదృష్టం కొద్ది మరీ ఇంత దారుణం అయితే కాదులేండి.