Begin typing your search above and press return to search.
ఈ ఫోటోలోని పసుపురంగు చీర కట్టుకున్న ఆమెను గుర్తు పట్టారా?
By: Tupaki Desk | 7 Dec 2020 9:24 AM GMTకరోనా పుణ్యమా అని.. ఇప్పుడో చిత్రమైన పరిస్థితి. భౌతిక దూరం సంగతి ఎలా ఉన్నా.. ముఖానికి మాస్కు పెట్టుకోవటం మాత్రం ఎక్కువైంది. దీంతో.. బాగా తెలిసిన వారిని తప్పించి.. అప్పుడప్పడు చూసే వారిని వెంటనే గుర్తించలేని దుస్థితి. ఈ రోజు చాలా చోట్ల ఒక ఫోటో వైరల్ గా మారింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో ఫైర్ బ్రాండ్ విజయశాంతి అలియాస్ రాములమ్మ బీజేపీ తీర్థం పుచ్చుకోవటం తెలిసిందే.
ఈ సందర్భంగా దిగిన ఫోటో ఒకటి బయటకు వచ్చింది. వ్యాట్సప్ లోనూ.. సోషల్ మీడియాలోనూ బాగా వైరల్ అయ్యింది. ఆ ఫోటోలో అమిత్ షా.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. సీనియర్ నేత వివేక్ తో పాటు.. పసుపురంగు చీరతో ఒక మహిళ కూడా ఉన్నారు. ముఖానికి మాస్కు పెట్టుకున్న ఆమెను.. చాలామంది గుర్తించలేకపోతున్నారు. కానీ.. ఆమె ఎవరన్న ఆసక్తి చాలామందిలో వ్యక్తమైంది.
ఇంతకూ ఆమె ఎవరో కాదు.. తెలంగాణ తొలి పైలట్ అజ్మీరా బాబీ. విజయశాంతితో పాటు.. ఆమె కోసం బీజేపీలో చేరారు. మంచిర్యాలకు చెందిన ఆమె తల్లిదండ్రులు టీచర్లుగా పని చేసి రిటైర్ అయ్యారు. ఎంబీఏ పూర్తి చేసిన బాబీ.. తన అభిరుచికి తగ్గట్లు తొలుత ఎయిర్ హోస్టెస్ గా పని చేశారు. ఆ తర్వాత పైలట్ గా ట్రైనింగ్ తీసుకున్నారు. తర్వాతి దశలో పైలట్ గా వ్యవహరించిన ఆమె.. తాజాగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో వీరిద్దరు కీలకభూమిక పోషించటం ఖాయమన్న మాట.