Begin typing your search above and press return to search.

ట్యాప్ చేయలేదంటున్న ఏసీబీ

By:  Tupaki Desk   |   10 Jun 2015 4:21 AM GMT
ట్యాప్ చేయలేదంటున్న ఏసీబీ
X
నోటుకు ఓటు కేసులో ముఖ్యమైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు ఫోన్‌లను ట్యాప్ చేశారని, అందులో భాగంగానే స్టీఫెన్ సన్ తో మాట్లాడిన టేపులు బయటకు వచ్చాయనే వార్తలపై ఏసీబీ అధికారులు ఎట్టకేలకు స్పందించారు. తెలంగాణ ఏసీబీ డైరెక్టర్ జనరల్ ఏకే ఖాన్ ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు, ఆ రాష్ట్ర ముఖ్యుల ఫోన్‌లను ట్యాపింగ్ చేశారని వార్తాపత్రికలు, చానళ్లల్లో వస్తున్న వార్తలను ఖండించారు.

తెలంగాణ అవినీతి నిరోధక విభాగం పూర్తి వృత్తి నిబద్ధత కలిగిన దర్యాప్తు సంస్థ అని ఆయన స్పష్టం చేశారు. ఏ కేసు విషయంలోనైనా పూర్తిగా చట్టం, నియమనిబంధనలకు లోబడి దర్యాప్తు చేస్తోందన్నారు. వృత్తిపరంగా బాధ్యతాయుతంగా పనిచేస్తున్న సంస్థ ఏసీబీ అని, తాము పారదర్శకంగా పనిచేస్తున్నామని ఏసీబీ డీజీ వివరించారు.
ట్యాపింగ్ వ్యవహారంపై తేల్చుకునేందుకు ముగ్గురు మంత్రులతో ఏపీ ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసిన తర్వాత తెలంగాణ ఏసీబీ స్పందించడం కొసమెరుపు.