Begin typing your search above and press return to search.
అంబానీ కొడుకు తోపునే.. ఏకంగా టైమ్ 100 నెక్ట్స్ లో చోటు
By: Tupaki Desk | 30 Sep 2022 4:30 PM GMTదేశంలోనే అపర కుబేరుడు ముఖేష్ అంబానీ మాత్రమే కాదు.. ఆయన సంతానం కూడా అంతే యాక్టివ్ గా వ్యాపార రంగంలో దూసుకెళుతోంది. తండ్రిని మించిన తనయులుగా ఎదిగేందుకు దూసుకెళుతున్నారు. ముఖేష్ వారసత్వాన్ని ఖచ్చితంగా కొనసాగించి.. అంతకుమించిపోయేలా చేసేందుకు ఆయన కుమారుడు ఆకాశ్ అంబానీ అడుగులు వేస్తున్నారు. తాజాగా ఆకాశ్ అంబానీ అరుదైన ఘనత సాధించాడు.
టైమ్ మ్యాగజైన్ ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ పెద్ద కుమారుడు.. రిలయన్స్ జియో ఛైర్మన్ ఆకాష్ అంబానీని టైమ్ 100 ఎమర్జింగ్ లీడర్ షిప్ జాబితాలో చోటు కల్పించింది. ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తల కేటగిరీలో ఆయన ఎంపికయ్యారు. ఆకాష్ అంబానీ గురించి టైమ్ మ్యాగజైన్ మాట్లాడుతూ.. ‘వ్యాపారాన్ని పెంపొందించేందుకు ఆయన తీవ్రంగా శ్రమిస్తున్నారని’ చెప్పారు. గూగుల్ మరియు ఫేస్‌బుక్‌లతో బిలియన్ డాలర్ల పెట్టుబడి ఒప్పందాలను పూర్తి చేయడంలో ఆకాష్ అంబానీ కీలక పాత్ర పోషించాడు.
టైమ్ 100 నెక్స్ట్ లిస్ట్‌లో కనిపించిన ఏకైక భారతీయుడు ఆకాష్ అంబానీయే.. ప్రపంచంలోని వర్ధమాన స్టార్ ఆకాష్ అంబానీ గురించి టైమ్ మ్యాగజైన్ ప్రత్యేకంగా కొనియాడింది. 22 ఏళ్ల వయస్సులో ఆకాష్ అంబానీ జియో బోర్డులో చోటు సంపాదించాడని పేర్కొంది. అదే సంవత్సరం జూన్‌లో అతనికి భారతదేశపు అతిపెద్ద టెలికాం కంపెనీ అయిన జియో యొక్క బాధ్యతలు ఇవ్వబడింది. 42 కోట్ల 60 లక్షల మంది కస్టమర్లను కలిగి ఉన్న రిలయన్స్ జియోను నిర్వహించే బాధ్యత ఇప్పుడు చైర్మన్ ఆకాష్ అంబానీ భుజాలపై ఉంది.
రిలయన్స్ జియో యొక్క 5g రోల్ అవుట్ ఆకాష్ అంబానీ పర్యవేక్షణలో జరుగుతోంది. దీపావళి నాటికి ఢిల్లీ, ముంబై మరియు మరికొన్ని మెట్రోలలో 5జీ లాంచ్ చేయాలని కంపెనీ యోచిస్తోంది. జియో మాత్రమే 700 MHz స్పెక్ట్రమ్ బ్యాండ్‌ను కొనుగోలు చేసింది. ఇది స్టాండ్-అలోన్ 5g నెట్‌వర్క్ అంటే ట్రూ 5జీ అమలు చేయగల ఏకైక స్పెక్ట్రమ్ బ్యాండ్. అమెరికా మరియు ఐరోపాలో 700 MHz బ్యాండ్ 5జీ ప్రీమియం బ్యాండ్‌గా పరిగణించబడుతుంది. ఈ నేపథ్యంలో 5g విషయానికొస్తే, ఇతర కంపెనీల కంటే జియో ముందుంది.
టైమ్ మ్యాగజైన్ ప్రతి సంవత్సరం 100మంది ఔత్సాహిక యువ పారిశ్రామిక వేత్తల జాబితాను ప్రచురిస్తుంది. ఈ లిస్ట్‌లో దేశం, ప్రపంచమే కాకుండా ఇండస్ట్రీకి చెందిన 100 మంది వర్ధమాన తారలకు చోటు దక్కింది. 2022కి సంబంధించిన టైమ్ 100 జాబితాలో సంగీత విద్వాంసులు అలాగే వృత్తిపరమైన వైద్యులు, ప్రభుత్వ అధికారులు, ఆందోళనకారులు, ఉన్నత స్థాయి విజిల్ బ్లోయర్‌లు, అగ్ర CEO లు ఉన్నారు. ఈ సెలబ్రిటీలు ప్రపంచాన్ని పునర్నిర్మించడమే కాకుండా భవిష్యత్తును పునర్నిర్వచించటానికి ప్రయత్నిస్తారని టైమ్ పేర్కొంది. అందుకే వీరికి చోటు కల్పించినట్టు తెలిపింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.