Begin typing your search above and press return to search.
అక్రమ నిర్మాణం కూలుస్తున్నాడని బ్యాట్ తో కొట్టిన ఎమ్మెల్యే
By: Tupaki Desk | 26 Jun 2019 11:46 AM GMTఅక్రమ నిర్మాణాల విషయంలో ఏపీ ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరిస్తుందో చూస్తున్నదే. తాజాగా ఇప్పుడు అలాంటి పనే చేసిన మధ్యప్రదేశ్ అధికారికి ఒకరికి దారుణమైన పరిస్థితి ఎదురైంది. మాజీ ముఖ్యమంత్రి నిర్మించిన అక్రమ నిర్మాణాన్ని నిర్దాక్షిణ్యంగా కూల్చేయటం ద్వారా అక్రమ నిర్మాణాల విషయంలో తానెంత కఠినంగా ఉంటానన్న విషయాన్ని చెప్పేశారు ఏపీ సీఎం జగన్.
దీనికి పూర్తి భిన్నమైన వాతావరణం మధ్యప్రదేశ్ లో నెలకొంది. ఇండోర్ లో అక్రమ నిర్మాణాలకు వ్యతిరేకంగా ఒక మున్సిపల్ ఉద్యోగి స్పెషల్ డ్రైవ్ షురూ చేశారు. ఇందులో భాగంగా నిర్మాణాన్ని కూల్చేస్తుంటే బీజేపీ ఎమ్మెల్యే ఆకాశ్ విజయ్ వార్గియా అడ్డుకున్నారు. కూల్చివేతకు అడ్డు పడ్డారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.దీంతో రెచ్చిపోయిన బీజేపీ ఎమ్మెల్యే సదరు అధికారిని క్రికెట్ బ్యాట్ తీసుకొని కొట్టటం షురూ చేశారు. అక్కడి వారు ఎంత వారించినా ఆయన వినలేదు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ ఉదంతంపై విమర్శలు వెల్లువెత్తటంతో విషయాన్ని సర్దుబాటు చేయటానికి బీజేపీ నేతలు రంగంలోకి దిగారు.
ప్రభుత్వ అధికారి లంచం అడగటంతో సదరు ఎమ్మెల్యే అలా ప్రవర్తించారని బీజేపీ నేత హితేశ్ బాజ్ పాయ్ వెనకేసుకురావటం గమనార్హం. లంచం అడుగుతూ అధికారి తప్పు చేస్తే అలాంటి వారిని కంట్రోల్ చేయటానికి చట్టాలు ఉన్నాయి. అందుకు బిన్నంగా లంచం అడిగారంటూ చట్టాన్ని చేతిలోకి తీసుకుంటూ దాడి చేసిన ఎమ్మెల్యేను బీజేపీ నేతలు వెనకేసుకురావటంలో అర్థం లేదు. విధి నిర్వహణలో ఉన్న అధికారిపై ఎంత దారుణంగా దాడి చేశారో చూస్తే.. అక్కడి విషయం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి నేతలు ఉన్నప్పుడు అధికారులు తమ పనిని తాము అస్సలు చేయలేరు. ఇదిలా ఉంటే..దాడి చేసిన తమ నేతను అరెస్ట్ చేయొచ్చని.. కాకుంటే లంచం అడిగిన అధికారిని ముందుగా అరెస్ట్ చేయాలంటూ ప్రదర్శిస్తున్న తెలివి చూస్తే.. అసలు విషయం ఇట్టే అర్థం కాక మానదు.