Begin typing your search above and press return to search.

కేసీఆర్ కోసం..కాంగ్రెస్‌ కు స‌ర్దిచెప్పిన ఓవైసీ

By:  Tupaki Desk   |   5 Jan 2017 11:55 AM GMT
కేసీఆర్ కోసం..కాంగ్రెస్‌ కు స‌ర్దిచెప్పిన ఓవైసీ
X
తెలంగాణ అసెంబ్లీ స‌మ‌వేశాల సంద‌ర్భంగా లంచ్ బ్రేక్‌ కు ముందు సరదా సన్నివేశంలో చోటు చేసుకుంది. విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ చర్చ ముగింపు సందర్భంగా అన్ని పార్టీల అభిప్రాయం చెప్పగా..విపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం తరపున సీఎం కేసీఆర్ విపులంగా - ఎంతో ఓపికతో స్ఫష్టంగా సమాధానమిచ్చారు. కేసీఆర్ రిప్లైతో ఎంఐఎం - బీజేపీ పార్టీలు సంతృప్తిని వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలిపాయి. అంతకు ముందు కాంగ్రెస్ సభ్యుడు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. సీఎం నుంచి స్ఫష్టమైన సమాధానం రాలేదని అందుకు నిరసన వ్యక్తం చేస్తున్నామని చెప్తూ అదే సబ్జెక్టుపై మళ్లీ మాట్లాడటానికి ప్రయత్నించారు.

దీంతో స‌భానాయ‌కుడిగా సీఎం కేసీఆర్‌ - శాస‌న‌స‌భా వ్య‌వ‌హారాల మంత్రి హరీష్ రావు కల్పించుకుని... సబ్జెక్టు ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని - సభ హుందాతనాన్ని కాపాడటానికి ప్రభుత్వం ఒక్కరోజు చర్చను రెండో రోజుకు పొడగించిందని - గౌరవ సభ్యులు మాట్లాడటానికి కావలిసినంత సమయం ఇచ్చినా ఇంకా చర్చిస్తామంటే ఎలా? అని ప్రశ్నించారు. సింగరేణి అంశంపై కూడా చర్చించాలని, దయచేసి సభ్యులు అర్థం చేసుకోవాలని కోరారు. అదే సమయంలో ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ కల్పించుకుని "అధ్యక్షా... సీఎం సాబ్ ఫుల్ క్లారిటీ ఇచ్చిన తరువాత కూడా కాంగ్రెస్ ప్రొటెస్ట్ చేయడం కరెక్టు కాదు.. సీఎం నుంచి మేము స‌రైన స‌మాధానం పొందాం...కాంగ్రెస్ తమ ప్రొటెస్ట్‌ ను వెనక్కి తీసుకుంటే మంచిది" అని హితవు పలికారు. దీంతో సభలో అంతా నవ్వులు విరిశాయి. అనంత‌రం కాంగ్రెస్ త‌న నిర‌స‌న‌ను ఉప‌సంహ‌రించుకుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/