Begin typing your search above and press return to search.

కేసీఆర్ అందమైన రైతు

By:  Tupaki Desk   |   29 Sep 2015 8:59 AM GMT
కేసీఆర్ అందమైన రైతు
X
తెలంగాణ అసెంబ్లీలో రైతు సమస్యలపై చర్చ సందర్భంగా ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ అందమైన రైతు అని, రాష్ట్రంలోని మిగతా రైతులు కూడా అలాగే స్మార్ట్‌ గా ఉండేలా చూడాలన్నారు. రైతు ఆత్మహత్యలపై ఏటా సభలో మాట్లాడుతూనే ఉన్నామని... అయినా ఆత్మహత్యలు ఆపేందుకు ప్రభుత్వం కృషి చేయడం లేదన్నారు. తప్పును టీఆరెస్ గత ప్రభుత్వాలపై నెట్టేస్తుందని... ఈ ఏడాదిరన్న కాలంలో టీఆరెస్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలన్నారు.

తెలంగాణలో రైతు కుటుంబాలు చాలా అప్పుల్లో ఉన్నాయన్నారు. తెలంగాణ రైతులు అందరూ కెసిఆర్‌ లా స్మార్ట్‌ గా మారాలన్నారు. ఈ సందర్భంగా ఆయన మంత్రుల నియోజకవర్గాల వారీగా రైతుల ఆత్మహత్యలను వెల్లడించారు. ఇకపై ఆత్మహత్యలు జరగనివ్వమని హామీ ఇస్తే ఈ ప్రభుత్వాన్ని ఎలా కావాలంటే అలా పొగుడుతానంటూ టీఆరెస్ ను ఇరుకునపెట్టారు. ఆత్మహత్యల నివారణకు అన్ని పార్టీలు కలిసికట్టుగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ''దయచేసి ఆత్మహత్యలు చేసుకోకండి'' అంటూ ఆన్నదాతలకు చేతులెత్తి కోరారు.