Begin typing your search above and press return to search.
ఆపరేషన్ సక్సెస్ - అక్బరుద్దీన్ సేఫ్
By: Tupaki Desk | 18 Jun 2019 5:57 AM GMTఎంఐఎం శాసనసభాపక్ష నాయకుడు - చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఆరోగ్యం విషయంలో కీలక పరిణామం తెరమీదకు వచ్చింది. లండన్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కోలుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పార్టీ కేంద్ర కార్యాలయం దారుస్సలాంలో జరిగిన ఈద్-మిలాప్ కార్యక్రమంలో అసదుద్దీన్ మాట్లాడుతూ... తన తమ్ముడు - ప్రజానాయకుడు అక్బరుద్దీన్ ఆరోగ్యం మళ్లీ క్షీణించిందని - చికిత్స కోసం లండన్ లోని దవాఖానకు తరలించినట్టు ప్రకటించడం సంచలనం సృష్టించింది. అయితే, తాజాగా ఆయన ఆరోగ్యం పూర్తిగా కోలుకున్నట్లు సమాచారం.
2011 మే 4న అక్బరుద్దీన్ పై చాంద్రాయణగుట్టలో హత్యాయత్నం జరిగింది. ఊరేగింపులో పాల్గొన్న ఒవైసీపై మహమ్మద్ పహిల్వాన్ తోపాటు కొందరు కత్తులు - రివాల్వర్ తో దాడికి పాల్పడ్డారు. పెద్ద పేగుకు గాయం - కిడ్నీలో బుల్లెట్ ఉండిపోవడంతో తరుచూ అనారోగ్యానికి గురవుతున్నారు. లండన్ లో చికిత్స పొంది - హైదరాబాద్ వచ్చి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే, ఆయన ఆరోగ్యం తిరిగి సమస్యాత్మకంగా మారిన నేపథ్యంలో తిరిగి లండన్ లో చేర్పించారు. ఈ నేపథ్యంలో - అక్బరుద్దీన్ ఒవైసీ ఆరోగ్యం మెరుగుపడాలని - పెద్దపులిలా తిరిగి రావాలని అల్లాను ప్రార్థించాలని అసదుద్దీన్ ప్రజలను కోరారు. కాగా, అక్బర్ ఆరోగ్యం మెరుగుపడిందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎంఐఎం వర్గాలు వెల్లడించాయి.
లండన్ లోని ఓ కార్పొరేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న అక్బరుద్దీన్ ఒవైసీ పూర్తిగా కోలుకున్నారని, ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారని ఎంఐఎం వర్గాల తెలిపాయి. ఈ నెల 21న అక్బరుద్దీన్ హైదరాబాద్ కు చేరుకుంటారని ఎంఐఎం పార్టీ నాయకులు చెప్పారు. హైదరాబాద్ కు తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని పార్టీలో సీనియర్ నాయకుడొకరు వెల్లడించారు.