Begin typing your search above and press return to search.

అక్బర్ కు ఏమైంది.? మొన్ననే తిట్టి నేడు గాంధీని పొగిడి..?

By:  Tupaki Desk   |   28 April 2020 6:40 PM IST
అక్బర్ కు ఏమైంది.? మొన్ననే తిట్టి నేడు గాంధీని పొగిడి..?
X
ఓవైసీ బ్రదర్స్.. అన్న, హైదరాబాద్ ఎంపీ, మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ తెలంగాణ సీఎం కేసీఆర్ తో సాన్నిహిత్యం నెరుపుతారు. అవకాశం దొరికిన ప్రతీసారి ప్రశంసల్లో ముంచెత్తుతాడు. అయితే ఆయన తమ్ముడు ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పూర్తి వ్యతిరేకం. భిన్నమైన ఆవేశపరుడైన వ్యక్తి. ఆయన ఆవేశమే ఆయనకు కష్టాలు తెచ్చిపెడుతోంది. ఎప్పుడూ ఎవరినో ఒకరిని తిడుతూనే ఉంటాడు. ఆ మధ్య కత్తిపోట్లకు గురయ్యాడు. మాజీ సీఎం కిరణ్ ఈయనను జైలుకు కూడా పంపించాడు. అక్బర్ ఎప్పుడూ టీఆర్ఎస్ పాలనను.. కేసీఆర్ పై నోరుపారేసుకుంటూనే ఉంటాడు.

ఇటీవల రెండు రోజుల కిందట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ తెలంగాణలో కరోనా నివారణ చికిత్సలకు కేంద్రమైన గాంధీ ఆసుపత్రిపై తీవ్ర విమర్శలు చేశారు. గాంధీ కంటే జైలు నయం అంటూ నోరుపారేసుకున్నారు. ఇక్కడ వసతులు ఏం లేవంటూ కేసీఆర్ సర్కారుపై విమర్శలు గుప్పించారు.

అయితే అన్న అసదుద్దీన్ క్లాస్ పీకాడో.. లేదా నిజంగానే గాంధీలో వసతులు బాగున్నాయని రోగులు చెప్పారో.. ఏమో కానీ అక్బరుద్దీన్ మాట మార్చాడు. గాంధీ ఆస్పత్రిపై ప్రశంసలు కురిపించాడు. గాంధీ ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది బాగా పనిచేస్తున్నారని అన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులతోనే తాను అలా మాట్లాడానని అన్నారు.

ఇక ఎవరైనా తప్పులు చేస్తారని.. తాను ఒత్తిడితోనే అలా మాట్లాడి ఉండొచ్చు అని నాలుక కరుచుకున్నారు. ఇక గచ్చిబౌలిలో 20 రోజుల్లోనే నిర్మించిన 1500 పడకల ఆస్పత్రి అద్భుతమని కొనియాడారు.

ఇక తెలంగాణలోని పాతబస్తీలో ఎంత కరోనా ప్రబలుతున్నా.. కేసుల్లో ముస్లింల సంఖ్య భారీగా ఉన్న తమ ఒవైసీ రెండు ఆస్పత్రులు, బోధనాస్పత్రిని ఇవ్వడానికి ముందుకు రాని అక్బరుద్దీన్ తాజాగా తమ రెండు ఆస్పత్రులను కరోనా కోసం సిద్ధం చేస్తున్నామని అన్నారు. 250 పడుకలు సిద్దంగా ఉంచామని ప్రభుత్వం అనుమతిస్తే చికిత్స చేస్తామన్నారు.

ఇలా ఉద్వేగం.. ఆవేశంతో చెలరేగిపోయి నోరుజారడం అక్బరుద్దీన్ కు ఇదే తొలిసారి కాదు.. మాజీ సీఎం కిరణ్ హయాంలోనూ ఇలానే నోరుజారి జైలుపాలయ్యాడు. అయినా తన తీరు మార్చుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.