Begin typing your search above and press return to search.

అక్బరుద్దీన్ సలహా బాగుంది కానీ... నెంబర్ వీక్

By:  Tupaki Desk   |   29 Jun 2020 4:00 PM GMT
అక్బరుద్దీన్ సలహా బాగుంది కానీ... నెంబర్ వీక్
X
తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ కి, మజ్లిస్ పార్టీ మధ్య ఎంత సయోధ్య ఉందో అందరికీ తెలిసిందే. ఇద్దరు మిత్రుల్లా మెలుగుతారు. స్వయంగా కిషన్ రెడ్డి వీరిద్దరి సయోధ్యపై విమర్శలు కూడా చేశారు. అసద్ వల్లే కేసీఆర్ టెస్టులు చేయలేదని బహిరంగ విమర్శలు చేశారు. సాధారణ జనంలోను తెలంగాణలో టెస్టులు సరిగా చేయడం లేదన్న ఆరోపణలున్నాయి.

దీంతో విమర్శల దాటికి తెలంగాణ ప్రభుత్వం తలొగ్గింది. టెస్టులు సంఖ్య పెంచింది. 50 వేల టెస్టులు చేస్తామని ప్రకటించింది. అయితే, దానికి కూడా మధ్యలో బ్రేక్ ఇచ్చింది. మళ్లీ రేపట్నుంచి టెస్టులు చేస్తోంది. ఈ నేపథ్యంలో మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్ధీన్ నుంచి ప్రభుత్వానికి ఒక లేఖ వచ్చింది.

కరోనాతో పోరాడాలంటే... పరీక్షల సంఖ్యను భారీగా పెంచాలని అన్నారు. బానే డిమాండ్ చేశాడే మిత్రుడిని అని అనుకుంటే... ఆయన రాసిన లేఖలో ఓ ట్విస్టుంది. కోటి జనాభా ఉన్న హైదరాబాదులో మూడు పార్లమెంటు నియోజకవర్గాలున్నాయి. నగర ప్రాంతం ఎక్కువగా హైదరాబాదు సికింద్రాబాదు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోనే ఉంది. ప్రభుత్వం చేస్తామన్న 50 వేల టెస్టుల్లో 25 వేల టెస్టులు హైదరాబాదు పార్లమెంటు పరిధిలోనే చేయాలట. నాంపల్లిలోనే 2 వేలు టెస్టులు చేయాలట. ఇది ఎమ్మెల్యే డిమాండ్. ఇది ఎలా ఉందంటే... తమలపాకుతో కొట్టినట్టుంది.

వాస్తవానికి హైదరాబాదులో కోవిడ్ ను అధిగమించాలంటే ఆ టెస్టులేం సరిపోవు. ప్రతి కుటుంబానికి ఒక్కరిని పరీక్షించాలి. అంటే కనీసం 15 లక్షల టెస్టులు అయినా చేయాలి. దీనికి అయ్యే ఖర్చు 300 కోట్లే. అపుడే కరోనా అదుపు సాధ్యం కానీ... కేసీఆర్ మనసు నొప్పించకుండా కేవలం ఆయన ప్రకటించిన టెస్టుల్లో పాతికవేలు తమ నియోకవర్గంలో చేయాలట.

కొసమెరుపు ఏంటంటే... తొలుత ఈ ప్రాంతంలో టెస్టులకు నిరాకరించారు చాలామంది. ఇపుడే వారే సహకరిస్తున్నారు. కాలం అలా మారుస్తుంది ఎవరిని అయినా. బహుశా ప్రభుత్వం లాక్ డౌన్ ఉద్దేశం కూడా ఈ టెస్టులకోసమే కావచ్చు. కానీ లాక్ డౌన్ వల్ల కలిగే ఉపయోగం చేతులు దాటిపోయింది.