Begin typing your search above and press return to search.

ఓవైసీది ఎంత జాలి గుండె !

By:  Tupaki Desk   |   2 Oct 2015 8:58 AM GMT
ఓవైసీది ఎంత జాలి గుండె !
X
కొంద‌రి నాయ‌కుల మాట‌లు ఎలా ఉంటాయంటే.... ఒక ప‌నిని వాళ్లు చేస్తే అది సంసారం. ఎదుటివాళ్లు చేస్తే వ్య‌భిచారం అన్నట్లుగా ఉంటుంది. ఇందుకు స‌రిగ్గా స‌రిపోయే ఉదాహ‌ర‌ణ ఎంఐఎం నాయకుడు అస‌దొద్దీన్ ఓవైసీ. రెచ్చ‌గొట్టే రాజ‌కీయాలు, మ‌త‌ప‌ర‌మైన విద్వేషాలే ఏకైక ఎజెండాగా మాట్లాడే ఓవైసీ....తాజాగా మ‌రో స్టేట్‌ మెంట్ ఇచ్చారు.

గ్రేటర్ నోయిడా వ్య‌క్తి అయిన‌ అక్ లాక్‌, అతని కొడుకు దానిస్‌ ల‌పై స్థానికులు దాడిచేయ‌గా అక్‌ లాక్ చ‌నిపోయారు. గోవును చంపారేమోనన్న అనుమానం దీనికి కార‌ణం. ఈ విష‌యంపై ఎంఐఎం అధ్యక్షుడు, హైద‌రాబాద్‌ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా మండిప‌డ్డారు. 'ఒకవేళ గోవును చంపితే.. ఇలా శిక్షిస్తారా' అంటూ నిప్పులు చెరిగారు. 'ఓ వ్యక్తిని చంపారని తెలిసి చాలా ఆశ్చర్యపోయాను' అంటూ మ‌నిషిని చంపేవారికి మ‌ద్ద‌తిచ్చే ఓవైసీ స‌న్నాయి నొక్కులు నొక్కారు. 'బీఫ్ తింటే మాత్రం చంపాలని ఆదేశాలు జారీ చేస్తారా? అలా అయితే, చట్టాలు.. కోర్టులు.. పోలీసులు ఎందుకు.. వాటినన్నింటిని మూసివేయొచ్చుగా' అంటూ తీవ్రంగా మండిపడ్డారు. 'ఇక్కడ ఎవరికి స్వేచ్ఛ లేదు. ప్రజాస్వామ్యాన్ని దోపిడీ, దౌర్జన్య సామ్యంగా మార్చుతున్నారు' అని కూడా స్టేట్‌మెంట్ ఇచ్చేశారు. ఏ స్వేచ్ఛ‌లేనిదే..... ఒక్క చాన్స్ ఇస్తే దేశంలో హిందువులు లేకుండా చేస్తాన‌ని వ్యాఖ్య‌లు చేసిన ఆయ‌న త‌మ్ముడు అక్బరుద్దీన్ బెయిల్‌ పై బ‌య‌ట తిర‌గ‌తున్నాడా అనేది మాత్రం చెప్ప‌లేక‌పోయాడు.

ఓవైసీ మ‌రిన్ని మాట‌లు కూడా చెప్పారు. భారత్ ను హిందుత్వ దేశంగా చేయాలని సంఘ్ పరివార్ సభ్యులు ప్రయత్నిస్తే దేశం మరింత బలహీనమవుతుందని వ్యాఖ్యానించారు. అయితే ఓవైసీ అస‌లు విష‌యాలు మాత్రం ఎప్ప‌ట్లాగే ప‌క్క‌న‌పెట్టేశారు. ఆ ఘ‌ట‌న‌పై స్పందించిన స్థానిక‌ ప్రభుత్వం రూ. 10 లక్షల పరిహారం చెల్లించింది. ఘటనకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకునేందుకు విచార‌ణ చేస్తోంది.

అమాయ‌కుల‌ను కాల్చిచంపిన తీవ్ర‌వాది వికారుద్దీన్‌ కు మ‌ద్ద‌తుగా మాట్లాడిన ఓవైసీ మ‌నుషుల ప్రాణాల గురించి భారీ డైలాగ్‌ లు చెప్ప‌డం ఆశ్చ‌ర్య‌మే.