Begin typing your search above and press return to search.
అక్బరుద్దీన్ ను లేపేస్తారట..బెదిరిస్తుంది వాళ్లేనా?
By: Tupaki Desk | 10 Nov 2018 4:30 PM GMTఎంఐఎం నేత - మాజీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొద్దికాలం క్రితం అవసరమైతే తెలంగాణలో తాము అధికారంలోకి వస్తామని - కర్నాటకలో జేడీఎస్ నేత కుమారస్వామి సీఎం అయినట్లే - ఎంఐఎం సైతం రాబోయే కాలంలో సీఎం పీఠం అధిరోహించవచ్చని ప్రకటించి కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యల అనంతరం కొద్దికాలంగా మీడియాకు, వార్తలకు దూరంగా ఉన్న అక్బరుద్దీన్ తాజాగా తన గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. నన్ను చంపేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. తనపై కుట్రకు సంబంధిచి బెదిరింపు లేఖలు - ఫోన్ కాల్స్ వస్తున్నాయని తెలిపారు. అక్బరుద్దీన్ చేసిన ఈ కామెంట్లు రాజకీయాల్లో కలకలం సృష్టిస్తున్నాయి.
గతంలో పాతబస్తీ బార్కస్ లో 2011 ఏప్రిల్ 30న అక్బరుద్దీన్ పై మహ్మద్ పహిల్వాన్ తో పాటు అతని అనుచరులు కత్తులు - పిస్టల్ తో దాడి చేశారు. ఈ దాడిలో అక్బరుద్దీన్ కు 5 కత్తి పోట్లు పడ్డాయి మూడు బుల్లెట్లు శరీరంలోని వెళ్లాయి. దాడి చేసిన వారిని అడ్డుకునేందుకు గన్ మెన్ జానీమియా కాల్పుల్లో ఇబ్రహీం అనే యువకుడు చనిపోయిన విషయం తెలిసిందే. అక్బరుద్దీన్ పై దాడి కేసులో నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించి నలుగురిని దోషులను నిర్ధారించింది. దోషులకు కోర్టు రూ.10వేల జరిమానాతో పాటు 10 ఏళ్లు జైలు విధిచింది. వీడియోలోమ కనిపించిన నలుగురికి కోర్టు శిక్ష ఖరారు చేసింది. శిక్ష పడ్డవారిలో సలీంబిన్ - అబ్దుల్లాయాపై - అవద్ యాపై - అసన్ బిన్ యాలు ఉన్నారు. ప్రధాన నిందితుడు పహిల్వాన్ సహా పదిమందిపై కోర్టు కేసు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో అక్బరుద్దీన్ తనపై హత్యాయత్నం జరగటానికి కుట్ర జరుగుతోందని ఎన్నికల వేళ సభ ఏర్పాటు చేసి వెల్లడించటం సంచలనానికి దారితీస్తోంది.
యాకుత్‌పురాలో ప్రత్యేక సభను ఏర్పాటు చేసి మరీ అక్బరుద్దీన్ ఒవైసీ తనపై జరుగుతున్న హత్యాయత్నాన్ని వెల్లడించారు. తనపై కుట్రకు సంబంధిచి బెదిరింపు లేఖలు - ఫోన్ కాల్స్ వస్తున్నాయని తెలిపారు. అంతేకాదు అహ్మదాబాద్ - కర్ణాటక నుండి 11మంది రంగంలోకి దిగారని అక్భరుద్దీన్ ఒవైసీ తెలిపారు. అయితే, అక్బరుద్దీన్ ఎన్నికల సమయంలో చేసిన ఈ కామెంట్లు సంచలనంగా మారాయి. అక్బర్‌ను చంపేందుకు ప్రయత్నిస్తోంది ఎవరు? గతంలో ప్రయత్నం చేసిన వారే ఇప్పుడు కూడా ప్రయత్నిస్తున్నారా? అనేది కూడా చర్చనీయాంశంగా మారింది.