Begin typing your search above and press return to search.
అక్బరుద్దీన్ పై పోటీకి బాడీ బిల్డర్ ఈసా
By: Tupaki Desk | 22 Nov 2018 10:57 AM GMTఈ సారి పాతబస్తీలో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ప్రత్యర్థులపై తనదైన శైలిలో విరుచుకుపడే అక్బరుద్దీన్ ఓవైసీని ఓడించేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కంకణం కట్టుకున్నట్టు ఉన్నాయి. బలమైన అభ్యర్థులను బరలోకి దింపాయి. బీజేపీ ఓ మహిళను రంగంలోకి దింపగా, కాంగ్రెస్ ఓ మల్ల యోధుడిని పోటీకి పెట్టింది.
నామినేషన్ల ప్రక్రియ పూర్తవడంతో అందరూ ప్రచారంపై దృష్టిపెట్టారు. పాతబస్తీలోని చంద్రాయణగుట్ట మజ్లిస్ కు బలమైన ప్రాంతం. ఇక్కడ నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ పోటీ చేస్తున్నారు. వరుస విజయాలను సొంతం చేసుకున్న ఆయనపై కాంగ్రెస్ పార్టీ ఓ బలమైన మల్లయోధుడిని పోటీకి పెట్టింది. ఆయనే ఈసా బినోబైడ్ మిస్త్రీ.
ఈ పేరు చాలా మందికి తెలియకపోవచ్చునేమోకానీ, చంద్రాగుణగుట్టలో బాగా పాపులర్. ఆర్థికంగా స్థితిమంతుడైన ఆయన కండల పోటీల్లో పలు బహుమతులను కూడా గెలుచుకున్నారు. రాజకీయాలకు కొత్తైన, పోటీకి దిగింది మాత్రం అక్బరుద్దీన్ పైనే. హస్తం గుర్తుపై పోటీ చేస్తున్న ఈసా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. గెలిస్తే గనుక ఆయన పేరు రాష్ట్రం అంతటా మారుమోగుతుందనడంలో సందేహం లేదు.