Begin typing your search above and press return to search.

తెలంగాణలో తొలి ఫలితం.. ఎంఐఎం అక్బరుద్దీన్ గెలుపు

By:  Tupaki Desk   |   11 Dec 2018 4:32 AM GMT
తెలంగాణలో తొలి ఫలితం.. ఎంఐఎం అక్బరుద్దీన్ గెలుపు
X
తెలంగాణలో తొలి ఫలితం వచ్చింది.హైదరాబాద్ లోని చాంద్రాయణ గుట్ట నియోజకవర్గంలో ఎంఐఎం అభ్యర్థి, ఆ పార్టీ శాసన సభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ గెలుపొందారు. ఆయన సమీప కాంగ్రెస్ అభ్యర్థి పై విజయం సాధించారు.

ఎంఐఎంకు బలమైన నియోజకవర్గంగా చాంద్రాయణ గుట్ట ఉంది. ఇక్కడ ముస్లిం ఓటర్లు ఎక్కువ. ఆదినుంచి ఇక్కడ ఎంఐఎం ఆధిపత్యం కొనసాగుతోంది. ఈసారి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అక్బరుద్దీన్ పై యెమన్ నుంచి హైదరాబాద్ లో స్థిరపడ్డ బడా పారిశ్రామికవేత్తకు టికెట్ ఇచ్చింది.. టీఆర్ ఎస్ మాత్రం స్నేహపూర్వక పోటీలో భాగంగా బలహీన అభ్యర్థిని పెట్టింది.

దీంతో 45శాతమే పోలింగ్ అయిన ఈ నియోజకవర్గంలో ఎంఐఎం గెలుపొందింది. తెలంగాణలోనే తొలి ఫలితం వచ్చిన స్థానంగా చాంద్రయాణ గుట్ట నిలిచింది. తొలి విజేతగా అక్బరుద్దీన్ నిలిచారు.