Begin typing your search above and press return to search.

అఖండ‌ హిట్‌.. ఆర్ ఆర్ ఆర్ ట్రైల‌ర్ సూప‌ర్ హిట్.. టీడీపీకి ప్లస్‌.. ఎలాగంటే!

By:  Tupaki Desk   |   10 Dec 2021 2:30 AM GMT
అఖండ‌ హిట్‌.. ఆర్ ఆర్ ఆర్ ట్రైల‌ర్ సూప‌ర్ హిట్.. టీడీపీకి ప్లస్‌.. ఎలాగంటే!
X
న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన అఖండ సూప‌ర్ హిట్ టాక్ వ‌చ్చింది. ముఖ్యంగా విదేశాల్లో నూ ఈ మూవీ సూప‌ర్‌గా ఉంద‌నే టాక్ వినిపిస్తోంది. ఇక‌, తాజాగా జూనియ‌ర్ ఎన్టీఆర్ కీల‌క పాత్రలో వ‌చ్చిన ఆర్ ఆర్ ఆర్ ట్రైల‌ర్ కూడా సూప‌ర్‌గా ఉంద‌నే మాట వినిపిస్తోంది. ఈ రెండు మూవీల ద్వారా.. నంద‌మూ రి వంశం మళ్లీ పుంజుకుంద‌నే మాట వినిపిస్తోంది. ఇది టీడీపీకి ప్ల‌స్ అవుతుంద‌ని చెబుతున్నారు ప‌రిశీల కులు. టీడీపీ కేడ‌ర్‌లో నంద‌మూరి ఫ్యాన్సే ఎక్కువ‌గా ఉన్నారు. వీరంతా కూడా టీడీపీకే ఓటు బ్యాంకుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఇప్పుడు అటు బాల‌య్య‌, ఇటు జూనియ‌ర్‌ల(ట్రైల‌ర్‌) మూవీలు హిట్ కావ‌డంతో టీడీపీ సైనికులుగా ఉన్న నంద‌మూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఫీల‌వుతున్నారు. ఇది పార్టీ పుంజుకునేందుకు అవకాశం క‌ల్పించిన‌ట్టే అవుతుంద‌ని చెబుతున్నారు. ఈ విజ‌యాల ద్వారా.. టీడీపీలో మెల్ల‌గా నంద‌మూరి వంశం పాపులర్ అవుతుంద‌నే విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి. నిజానికి ఇప్ప‌టి వ‌రకు టీడీపీ అధినేత చంద్ర‌బాబు కుమారుడు.. లోకేష్ పై న‌మ్మ‌కం క‌నిపించ‌డం లేదు. ఆయ‌న గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోవ‌డం.. త‌ర్వాత‌.. కూడా స్థానిక ఎన్నిక‌ల్లోనూ బ‌ల‌మైన పోరు చేయ‌లేక పోవ‌డం వంటివి మైన‌స్‌గా ఉన్నాయి.

ఇక‌, ఇప్ప‌టి వ‌రకు ఉన్న ఆశ‌ల్లా.. చంద్ర‌బాబు మాత్ర‌మే. ఆయ‌న మాత్ర‌మే పార్టీకి దిక్సూచిగా క‌నిపిస్తు న్నారు. దీంతో టీడీపీ కేడ‌ర్ కు చంద్ర‌బాబుపైనే న‌మ్మకం ఉంద‌నే టాక్ వినిపిస్తోంది. ఒక‌వేళ లోకేష్‌కు ప‌ట్టం క‌డితే.. పార్టీ లో ఇబ్బందులు త‌ప్ప‌వ‌నే భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఇదే విష‌యాన్ని కొంద‌రు సీనియ‌ర్లు.. చంద్ర‌బాబు ద‌గ్గ‌ర నేరుగా చెబుతున్న‌ట్టు స‌మాచారం. దీంతో పార్టీలో కొత్త‌గా ఊపు క‌నిపించ‌డం లేదు. అయితే.. తాజాగా అఖండ్ ఇటు రెండు తెలుగు రాష్ట్రాలు స‌హా.. యూఎస్ ఏలోనూ హిట్ కావ‌డం.. బాల‌య్య పంచ్ డైలాగులు.. పేల‌డంతో టీడీపీలో క‌కొంత మార్పు క‌నిపిస్తోంద‌ని అంటున్నారు.

తాజాగా ఆర్ ఆర్ ఆర్ ట్రైల‌ర్ కూడా సూప‌ర్‌గా ఆక‌ట్టుకుంది. దీంతో మ‌ళ్లీ టీడీపీలోకి నంద‌మూరి వంశం వ‌స్తే.. బాగుంటుంద‌నే టాక్ వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో అటు అఖండ‌.. ఇటు ఆర్ ఆర్ ఆర్ ఊపుతో టీడీపీలో మంచి.. ఫాలోయింగ్ పెరుగుతుంద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. బాల‌య్య ఇప్ప‌టికే టీడీపీలో కీల‌క నాయకుడిగా ఉన్నారు. పైగా ఆయ‌న ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక‌, జూనియ‌ర్ కూడా తాత స్థాపించిన పార్టీ ప‌ట్ల సానుభూతితోనే ఉన్నారు. వెర‌సి.. ఈ ఇద్ద‌రి మూవీల ద్వారా.. టీడీపీ అభిమానులు మ‌రింత పుంజుకునే అవకాశం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీలకులు.