Begin typing your search above and press return to search.
అఖిల ప్రియకి ఆ సినిమా బాగా నచ్చిందట ... మిస్ యూ డ్యాడ్ అంటూ ఎమోషనల్ పోస్ట్ !
By: Tupaki Desk | 13 Aug 2020 9:50 AM GMTకర్నూల్ జిల్లా టీడీపీ కీలక నేత, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియా తాజాగా ఓ ఎమోషనల్ పోస్ట్ ను తన ట్విటర్ లో పోస్ట్ చేసింది. తాజాగా ఓ సినిమా చూసిన అఖిల్ ప్రియా.. ఆ సినిమా చూస్తున్నంత సేపూ నాన్నే గుర్తుకొచ్చారని, ఒకవేల నాన్న కనుక బ్రతికి ఉంటే ఆయనతో కలిసి ఆ సినిమాను చూసేదాన్ని అని తెలిపారు. స్త్రీ శక్తిని చాటి చెప్పిన సినిమాగా ఆ సినిమా పై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రతి ఒక్కరూ ఆ మూవీని చూడాలని చెప్పుకొచ్చారు. తండ్రీకుమార్తె మధ్య ఉన్న అనుబంధాన్ని ఈ సినిమా పదేపదే గుర్తు చేసిందని తెలిపారు.
ఇంతకీ భూమా అఖిల ప్రియను అంతగా ఆకట్టుకున్న సినిమా ఏంటి అని అనుకుంటున్నారా ? ఆ సినిమా ఏమిటి అంటే జాన్వీ కపూర్ నటించిన గుంజన్ సక్సేనా. ఈ చిత్రం తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. శరణ్ శర్మ దర్శకత్వం వహించిన ఈ మూవీని కరణ్ జొహార్, హీరూ జొహార్, అపూర్వ మెహతా నిర్మించారు. ఫ్లయిట్ లెప్టినెంట్ గుంజన్ సక్సేనా బయోపిక్ గా తెరకెక్కింది. కార్గిల్ గర్ల్ గా గుర్తింపు పొందిన గుంజన్ సక్సేనా వైమానిక దళంలో పనిచేవారు. కార్గిల్ యుద్ధ సమయంలో తన సేవలను అందించారు. చీతా హెలికాప్టర్లను నడపించారు. ఆమె చేసిన సేవలకు, ప్రదర్శించిన ధైర్య సాహసాలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం గుంజన్ సక్సేనాను శౌర్య చక్రతో సత్కరించింది. ఈ పతకాన్ని అందుకున్న తొలి మహిళ కూడా ఆమే కావడం విశేషం.
ఈ సినిమా చూసిన భూమా అఖిలప్రియ ప్రశంసించకుండా ఉండలేకపోయారు. తాను ఈ మూవీని చూశానని, చూస్తున్నంత సేపూ భావోద్వేగానికి గురయ్యానని అన్నారు. మహిళా శక్తిని ఈ సినిమా ప్రపంచానికి చాటి చెప్పిందని, వైమానిక దళంలో చేరాలనుకునే ఓ యువతి తన కలను ఎలా సాకారం చేసుకున్నారనే విషయాన్ని ఈ సినిమాలో చాలా బాగా చూపించారని, పట్టుదల దానికి తగ్గ కృషి ఉంటే దేనినైనా సాధించవచ్చు అని గుంజన్ సక్సేనా నిరూపించారని చెప్పారు. తండ్రీకుమార్తె మధ్య ఉండే ఆప్యాయతను అంతే అందంగా తెరకెక్కించారని , ఈ సినిమా చూస్తున్నంత సేపూ నాన్న గుర్తుకొచ్చారని అన్నారు. ఐ మిస్ మై డ్యాడ్ అని ట్విట్టర్ లో పోస్ట్ చేసారు.