Begin typing your search above and press return to search.
ఆ 50 ఎకరాలపై స్పందించిన అఖిలప్రియ తమ్ముడు
By: Tupaki Desk | 8 Jan 2021 4:52 PM GMTహఫీజ్ పేటలోని 50 ఎకరాల భూమి తమదేనని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సోదరుడు భూమా విఖ్యాత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. భూమా కుటుంబాన్ని ఆర్థికంగా రాజకీయంగా దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ఆస్తులు కాజేయాలనే ప్రయత్నం చేస్తున్నారని.. తమపై ఏపీ, తెలంగాణలో అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. తమ భూమిని కబ్జా చేసి మైహోమ్స్ కు లీజుకు ఇచ్చారని.. సీఎం కేసీఆర్ తమకు న్యాయం చేయాలని భూమా విఖ్యాత్ రెడ్డి కోరారు.
రాజకీయంగా తమను వేధిస్తున్నారని.. తమ సోదరిపై తప్పుడు కేసులు పెట్టారని విఖ్యాత్ రెడ్డి ఆరోపించాడు. హఫీజ్ పేట భూములు మావేనని.. తెలంగాణ సీఎం కేసీఆర్ న్యాయం చేయాలని ఆయన వేడుకున్నాడు.
హఫీజ్ పేట్ సర్వే నంబర్ 80లో ఇప్పటికే పదేళ్లకు పైగా వివాదాల సుడిగుండంలో కోర్టు కేసులతో ఇరుక్కుపోయింది. ఇప్పటికే ఈ భూమి విషయంలో హత్యలు, ప్రతి హత్యలతో దాదాపు డజను మందిని బలిగొన్నది.. తాజాగా కేసీఆర్ బంధువులు కూడా కిడ్నాప్ కేసులో భూమా అఖిలప్రియ అరెస్ట్ అయ్యారు.