Begin typing your search above and press return to search.
అఖిలప్రియ తమ్ముడు మరోసారి పరారే పరారే...!
By: Tupaki Desk | 17 Feb 2022 5:30 PM GMTదివంగత మాజీ మంత్రి భూమా నాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి ముద్దుల కుమార్తెగా రాజకీయాల్లోకి అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చింది భూమా అఖిలప్రియ. తన తల్లి, తండ్రి ఆకస్మికంగా చనిపోవడంతో ఆ సమీకరణలు, సానుభూతి కలిసొచ్చే అఖిల ఎమ్మెల్యే, మంత్రి అయిపోయారు.
గత ఎన్నికల్లో ఓడిపోయాక అఖిల వరుస వివాదాలతో రాజకీయంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బయట వాళ్లతో గొడవలే కాదు.. ఇటు ఆ ఫ్యామిలీలో అక్కా, తమ్ముడు - అక్కా చెల్లి మధ్య కూడా ఆస్తులు, ఇతరత్రా విబేధాలు తీవ్రంగానే కనిపిస్తున్నాయి.
ఇక వరుస వివాదాల్లో అఖిలప్రియనో లేదా ఆమె ఫ్యామిలీయో.. మరోసారి ఆమె భర్తో పరారీలో ఉండాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. తాజాగా అఖిల తమ్ముడు జగన్ విఖ్యాత్‌రెడ్డి మరోసారి పరారయ్యాడు.
ఈ సారి కర్నూలు పోలీసుల దెబ్బకు జగత్‌విఖ్యాత్ పరారవ్వాల్సి వచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు అఖిలప్రియ పోలీసుల నుంచి తన తమ్ముడికి ప్రాణహానీ ఉందని ఆరోపిస్తుండడం విశేషం.
ఆళ్లగడ్డలో రోడ్ల విస్తరణ పనులు జరుగుతున్నాయి. అయితే అక్కడ భూమా నాగిరెడ్డి పేరుతో ఓ బస్టాండ్ నిర్మించారు. అయితే అధికారులు ఆ బస్టాండ్‌ను తొలగించారు. దీంతో విఖ్యాత్ అక్కడకు వెళ్లి నానా హంగామా చేయడంతో పాటు పోలీసులు, మున్సిపల్ సిబ్బందిపై ఫైర్ అవ్వడంతో పాటు మునిసిపల్ కమిషనర్‌ను సైతం యూజ్‌లెస్ ఫెలో అని నోరు పారేసుకున్నాడు.
అంతేకాకుండా ఓ పోలీస్‌ను కొట్టేందుకు జగన్ చెయ్యెత్తాడన్న విమర్శలు కూడా వస్తున్నాయి. జగత్ దురుసు ప్రవర్తనతోనే పోలీసులు కేసు నమోదు చేశారు. కర్నూలు ఎస్పీ రాజకీయ నాయకుల దూకుడుతో పాటు రౌడీయిజంపై సీరియస్‌గా ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే తనపై కేసు నమోదు కావడంతో జగత్ విఖ్యాత్ పరారయ్యాడు. ఏదేమైనా ఈ ఫ్యామిలీలో ఎప్పుడూ ఎవరో ఒకరు పోలీసు కేసుల్లో చిక్కుకుని పరారవుతూ భూమా ఫ్యామిలీ పరువు తీసేస్తున్నారు.