Begin typing your search above and press return to search.
ఏపీ మంత్రి గారికి నిశ్చితార్థం..వరుడు ఎవరంటే
By: Tupaki Desk | 12 May 2018 10:29 AM GMTఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ మంత్రి అఖిలప్రియకు పెళ్లి కుదిరింది. మే 12వ తేదీ శనివారం ఉదయం హైదరాబాద్ లోని మంత్రి ఇంట్లోనే భార్గవరామ్ తో నిశ్చితార్థం జరిగింది. భార్గవ్.. ఏపీ మాజీ డీజీపీ సాంబశివరావు మేనల్లుడు. రెండు కుటుంబాలు ఈ వేడుకను ఘనంగా నిర్వహించాయి. అలాగే.. మంత్రి నారాయణ అల్లుడు పునీత్‌కు పిన్ని కుమారుడని వార్తలు వస్తున్నాయి. భార్గవ్ పలు వ్యాపారాలు చేస్తున్నట్టు తెలిసింది. భార్గవ్‌తో అఖిలప్రియకు గత కొంతకాలంగా పరిచయం ఉన్నట్టు సమాచారం. ఈ వేడుకకు సంబంధించి ఫొటోలు బయటకొచ్చినా అధికారికంగా ఎటువంటి ప్రకటనా రాలేదు. ఇవాళ జరిగిన నిశ్చితార్థానికి ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, బ్రహ్మానందరెడ్డి తదితరులు హాజరయ్యారు.
ఏపీ పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిలప్రియ తండ్రి నాగిరెడ్డి సీనియర్ నాయకుడును అనే సంగతి. ఆమె తల్లి శోభా నాగిరెడ్డి సైతం ప్రముఖ రాజకీయవేత్తగా గుర్తింపు పొందారు. ఇటీవలే ఆయన గుండెపోటుతో చనిపోయారు. ఆ తర్వాత అఖిలప్రియ రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. స్నేహితులుగా ఉన్న వీరు...ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. నిశ్చితార్థం వేడుకను బంధువులు - కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్ రెడ్డి - బ్రహ్మానందరెడ్డి దగ్గరుండి వేడుక నిర్వహించారు. అఖిలప్రియ - భార్గవ్ మధ్య కొద్దికాలంగా పరిచయం ఉందని, తమ పరిచయం విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయగా వారు అంగీకరించడంతో వివాహం జరిపించేందుకు సిద్ధమయ్యారని సమాచారం. మాజీ డీజీపీ సాంబశివరావుకు బంధువు. పెళ్లి ఆగస్ట్ 29వ తేదీన జరగనుందని తెలుస్తోంది.
మరిన్ని ఫొటోస్ చూడటానికి క్లిక్ చేయండి