Begin typing your search above and press return to search.

ఎక్స్ బాస్ కారణంగా వెనక్కి వెళ్లిన అఖిలప్రియ

By:  Tupaki Desk   |   19 Jan 2017 9:52 PM IST
ఎక్స్ బాస్ కారణంగా వెనక్కి వెళ్లిన అఖిలప్రియ
X
కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి కుమార్తె.. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు ఊహించని పరిణామం ఎదురైంది. తన తల్లి ఆకస్మిక మరణంతో వచ్చిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించిన అఖిల ప్రియ.. తర్వాతి కాలంలో చోటు చేసుకున్న పరిణామాలతో ఆమె ఏపీ అధికారపక్షాని తండ్రితో పాటు వచ్చారు. గెలిచింది జగన్ పార్టీ తరఫున అయినా.. ప్రస్తుతం అధికార పక్షానికి మద్దతు ఇస్తున్నారు.

ఈ రోజు అమరావతిలోని సచివాలయానికి బయలుదేరి వెళ్లిన ఆమెకు.. అదే దారిలో వెళుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎదురయ్యారు. అమరావతి ప్రాంతంలో ఈ రోజు జనగ్ పర్యటిస్తున్న నేపథ్యంలో.. భారీగా ప్రజలు రోడ్ల మీద ఉండటం.. జగన్ కాన్వాయ్ కారణంగా వైఎస్సార్ కాంగ్రెస్ నేతలతో దారి మొత్తం బ్లాక్ అయిన పరిస్థితి. దీంతో.. భారీ ఎత్తున ట్రాఫిక్ స్తంభించింది. దీంతో.. కాసేపు రోడ్డు మీదనే ఉండిపోయిన ఆమె.. చేసేది లేక.. వెనక్కి తిరిగి వెళ్లిపోయారు. ఒకప్పటి తన బాస్.. ప్రస్తుతం ఎక్స్ బాస్ రోడ్డు మీద ఎదురుకావటం ఒక ఎత్తు అయితే.. జన సందోహంతో ముందుకు వెళ్లలేక వెనక్కి వెళ్లిపోవటం పలువురి దృష్టిని ఆకర్షించింది.