Begin typing your search above and press return to search.
అఖిలప్రియ కన్నీటికి కదలిపోయిన అసెంబ్లీ
By: Tupaki Desk | 14 March 2017 9:25 AM GMT దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి కుమార్తె, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియ తన తండ్రిని స్మరించుకుంటూ ఏపీ అసెంబ్లీలో ఉద్వేగభరితంగా మాట్లాడారు. తమ కుటుంబ జీవితం, తండ్రితో అనుబంధం, తన తల్లిదండ్రుల మధ్య అనుబంధం అన్నీ గుర్తు చేసుకున్నారు. అంతేకాదు.. ప్రజల కోసమే తమ తండ్రి బతికారని.. ఆయన ఆశయాలు నెరవేరుస్తానని చెప్పాలి. ఎవరూ లేని అనాథలుగా మారామన్న భయం తమకు లేదని.. అందరూ అండగా ఉండడం చూసి ధైర్యం కలుగుతోందన్నారు.
అనునిత్యమూ ప్రజల గురించి ఆలోచించే వ్యక్తికి తాను కుమార్తెగా జన్మించడం ఎంతో గర్వంగా ఉందని భూమా అఖిలప్రియ వ్యాఖ్యానించారు. ఆపై ఉబికివస్తున్న దుఖాన్ని దిగమింగుకుంటూ తన తండ్రి చివరి క్షణాల గురించి ఆమె గుర్తు చేసుకున్నారు. ఇంట్లో తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ను తొలుత ఆళ్లగడ్డకు, ఆపై నంద్యాలకు తీసుకు వెళ్లామని చెప్పారు. మెరుగైన చికిత్స కోసం తానెంతో తపించానని, ఎయిర్ లిఫ్ట్ చేయించేందుకు సహకారం అందించాలని ముఖ్యమంత్రికి ఫోన్ చేసి ఏడ్చానని చెప్పుకొచ్చారు. ఆపై తనను భయపడవద్దని, అన్ని ఏర్పాట్లూ చేయిస్తానని ఆయన ధైర్యం చెప్పారని, అరగంటకే హెలికాప్టర్ సిద్ధమైందని, హైదరాబాద్ కు తీసుకువెళ్లాలని భావించామని, అప్పటికే దురదృష్టంకొద్దీ ఆయన ఆరోగ్యం స్థిరంగా నిలవలేదని అన్నారు. ఆయన హార్ట్ బీట్ ఆగిందని డాక్టర్లు చెప్పిన తరువాత కూడా, మరోసారి ప్రయత్నించాలని తాను కోరానని, ఆపై రెండు గంటలపాటు వైద్యులు శ్రమించారని చెప్పుకొచ్చారు. పంప్ చేస్తుంటే, హార్ట్ బీట్ వస్తోందని, చెయ్యి తీసేస్తే హార్ట్ బీట్ పోతూ ఉందని, దీంతో తిరిగి గుండె కొట్టుకునే అవకాశాలు ఉన్నాయన్న ఆలోచనతో గంటల పాటు వైద్యులు కృషి చేశారని తెలిపారు.
తన తల్లి, తండ్రి ఒకే ఆసుపత్రిలో మరణించారంటూ ఆమె కన్నీరు పెట్టుకున్నారు. వారిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటున్నప్పుడు ఆమె గొంతులో వేదన ధ్వనించింది. తన తల్లి చనిపోయిన తరువాత, మూడేళ్ల పాటు తండ్రి బతికున్నారంటే, తమకోసమేనని ఇప్పుడు అర్థమవుతోందని చెప్పారు. తానింక అనాథను కాదని, తన వెంట అసంఖ్యాక కార్యకర్తల బలం, చంద్రబాబు, లోకేష్ ల తోడు ఉందని అన్నారు. భరించలేని బాధను అభివృద్ధిపై కసిగా మార్చుకుని శ్రమిస్తానని చెప్పారు. తనను, తన తమ్ముడు, చెల్లెళ్లను ఒంటరి వాళ్లను చేసి కానరాని లోకాలకు వెళ్లిపోయిన తల్లిదండ్రులను తలచుకుని ఏడవటం నిన్నటితో ముగిసిందని, ఇక తాను వారి గురించి తలచుకుని ఏడుస్తూ ఉండిపోకూడదని గట్టిగా నిర్ణయించుకున్నానని అన్నారు. ఇక వారి కోరికలైన నంద్యాలలో పేదలకు పది వేల ఇళ్లు, రోడ్ల విస్తరణ, నీటి సమస్య తీర్చడంపై దృష్టిని పెడతానని, ఈ సమస్యలన్నీ తీరిన రోజున తన తండ్రిని తలచుకుని మనస్ఫూర్తిగా ఏడుస్తానని చెప్పారు. ఇక నియోజకవర్గాలపై దృష్టి సారించి, అభివృద్ధే లక్ష్యంగా సాగుతానని హామీ ఇచ్చారు.
తన తండ్రి భూమా నాగిరెడ్డికి సంతాపం తెలిపే సభలో విపక్షం కూడా పాల్టొంటుందని తనతో పాటు ప్రజలు కూడా ఆశించారని జగన్ జైలులో ఉన్నప్పుడు వైకాపా కోసం తన తల్లి శోభా నాగిరెడ్డి పని చేశారన్నారు. పార్టీ కోసం తమను కూడా వదిలేసి పర్యటనలు చేశారని గుర్తు చేసుకున్నారు. వైకాపా కోసం తన తండ్రి భూమా నాగిరెడ్డి కూడా చిత్తశుద్ధితో పని చేశారని చెప్పారు. విపక్షం సభకు హాజరుకాకపోవడాన్ని ఆమె తప్పుపట్టారు. నాన్న నిత్యం ప్రజల సంక్షేమం కోసమే ఆలోచించే వారనీ, సీమలో ఫ్యాక్షన్ లేకుండా చూడాలని కలలు కనే వారనీ పేర్కొన్నారు. అటువంటి మంచి వ్యక్తి, గొప్ప వ్యక్తికి కుమార్తె కావడం తన అదృష్టమని అఖిల ప్రియ అన్నారు. చిన్న తనంలోనే తండ్రిని పోగొట్టుకున్న భూమా నాగిరెడ్డి…మా పెదనాన్న పిల్లలను కూడా మాతో సమానంగా పెంచారని చెప్పారు. నాన్న ఆశయాల సాధన కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అఖిలప్రియ చెప్పారు. నూతన శాసనసభలో తన తండ్రి గురించి ఇలా చర్చించుకోవాల్సి వస్తుందనుకోలేదని అఖిలప్రియ కన్నీటి పర్యంతమయ్యారు. అఖిల వేదనాభరితమైన ప్రసంగంతో అసెంబ్లీలోని అందరూ కళ్లు తుడుచుకోవడం కనిపించింది.