Begin typing your search above and press return to search.

రోజుకు 100 ప్రశ్నలు చొప్పున అఖిలప్రియను అడిగారట

By:  Tupaki Desk   |   14 Jan 2021 3:58 AM GMT
రోజుకు 100 ప్రశ్నలు చొప్పున అఖిలప్రియను అడిగారట
X
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి బంధువుల కిడ్నాప్ కేసులో.. నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు కస్టడీలోకి తీసుకోవటం తెలిసిందే. కోర్టు అనుమతితో మూడు రోజుల పాటు ఆమెను విచారించారు. విచారణలో భాగంగా రోజుకు వంద చొప్పున మూడు రోజుల వ్యవధిలో మూడు వందల ప్రశ్నల్ని ఆమెకు సంధించినట్లుగా పోలీసులు చెబుతున్నారు.

అఖిలప్రియను విచారించిన అధికారుల్లో డీసీపీ కల్మేశ్వర్ తో పాటు.. మరికొందరు మహిళా అధికారులు ఉన్నట్లుగా తెలుస్తోంది. పోలీసులు వేసిన ప్రశ్నలకు..చాలావరకు అఖిలప్రియ సమాధానాలు చెప్పలేదని తెలుస్తోంది. పోలీసులు ప్రశ్నలు అడిగినా.. అఖిల ప్రియ మౌనంగా ఉన్నారని.. కొన్నింటికి మాత్రమే సమాధానాలు ఇచ్చారని చెబుతున్నారు. అఖిల ప్రియ భర్త గురించి వివరాలు అడగ్గా.. తనకు తెలీదని సమాధానం ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

ఈ రోజు (గురువారం) మధ్యాహ్నం ఆమెను జైలుకు తిరిగి పంపుతారని చెబుతున్నారు. బాధితుల నుంచి పేపర్ల మీద సంతకాలు పెట్టించుకున్నారన్న విషయాన్ని పోలీసులు అడగ్గా.. తనకు ఆ విషయాలేవీ తెలీవని అఖిలప్రియ పేర్కొన్నట్లు సమాచారం. కిడ్నాప్ లో పాల్గొన్న వారికి సంబంధించిన వివరాలు అడిగితే.. తనకు ఎవరూ తెలీదని ఆమె చెప్పినట్లుగా తెలుస్తోంది. రాజకీయ నేతగా పలువురితో మాట్లాడతానని.. అందులో భాగంగానే మాట్లాడినట్లుగా పేర్కొన్నారు.