Begin typing your search above and press return to search.
లోక్ సభ ఎన్నికలు - మాయ, అఖిలేష్ సంచలన నిర్ణయం
By: Tupaki Desk | 17 March 2019 11:20 AM GMTదేశంలో ఎపుడు సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చిన ఎస్పీ-బీఎస్పీలు లేకుండా ప్రభుత్వాలు ఏర్పడవు. అతిపెద్ద రాష్ట్రం కావడంతో యూపీ దేశ రాజకీయాల్లో ఎపుడూ కీలక పాత్ర పోషిస్తోంది. అందుకే యూపీ వార్త అందరికీ వార్తే. తాజాగా మాయావతి, అఖిలేష్ యాదవ్ లు ఇద్దరూ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలన్నది వారి నిర్ణయం. ఇది అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
మొన్నటికి మొన్న మాయావతి ప్రధానమంత్రి కావాలని అఖిలేష్ అన్నారు. ఇటీవలే పవన్ అన్నారు. జాతీయ మీడియా కూడా అవకాశం వస్తే ఆమె ప్రధాన మంత్రి రేసులో ఉంటారు అన్నారు. ఆ వార్తలన్నిటికీ బ్రేక్ వేస్తూ మాయ భారీ ట్విస్ట్ ఇచ్చారు. పార్టీ అభ్యర్థులను గెలిపించుకుని యూపీలో అధికారం చేపట్టే ప్రక్రియలో భాగంగా... కేవలం పార్టీ కార్యకలాపాలకు పరిమితం కావాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారట. అసలు వీరిద్దరు పొత్తు పెట్టుకోవడం ఒక రాజకీయ సంచలనం.
ఎస్పీ-బీఎస్పీ కలవడం అంటే దేశంలో ఇక ఏ పార్టీ ఏ పార్టీతో అయినా కలవచ్చు చెప్పలేం అన్నట్టు. అలాంటిది కనీసం 60 లోక్ సభ సీట్లు టార్గెట్ చేసిన మాయవతి లోక్ సభలో పోటీకి దూరం అంటే అది అసాధారణ విషయమే కదా. ఈ వార్త విశ్లేషకుల మైండ్ బ్లాక్ చేసిందని చెప్పాలి. ఈ స్ట్రాటజీ వెనుక ఉద్దేశం ఏంటో కూడా ఇంకా అర్థం కావడం లేదు. మాయ నిర్ణయం కారణం తెలియకపోయినా అఖిలేష్ పోటీ చేయకపోవడానికి ఆయన భార్య డింపుల్ యాదవ్ కారణం. సిట్టింగ్ స్థానం కన్నౌజ్ నుంచి ఆమె లోక్ సభకు పోటీ చేస్తున్నారు. దీంతో తాను విరమించుకోక తప్పలేదని అఖిలేష్ అన్నారు.