Begin typing your search above and press return to search.
ఎస్పీలో మరో ట్విస్ట్...అధ్యక్షుడిగా అఖిలేష్
By: Tupaki Desk | 1 Jan 2017 10:30 AM GMTఉత్తరప్రదేశ్ లో అధికార సమాజ్ వాదీ పార్టీలోని పరిణామాలు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను మించి పోయిన ట్విస్ట్ లు ఇస్తున్నాయి. తాజాగా తండ్రికొడుకుల డ్రామా మరో మలుపు తిరిగింది. మొన్న యూపీ సీఎం - కొడుకు అఖిలేష్ ను పార్టీ నుంచి ములాయం బహిష్కరించడం.. నిన్న కాస్త మెత్తబడి మళ్లీ దానిని ఎత్తివేయడంతో ముసలం సమసిపోయిందని అంతా భావించారు. కానీ ఆదివారం ఈ డ్రామాకు కొత్త ట్విస్ట్ వచ్చింది. అధ్యక్ష పీఠంపై అఖిలేష్ కూర్చున్నారు. అంతేకాదు పార్టీ సీనియర్ నేత - తన తండ్రికి ఆప్తుడు అయిన అమర్ సింగ్ పై వేటు వేసేలా చక్రం తిప్పారు.
అనూహ్య పరిణామాల్లో భాగంగా తన ఎమ్మెల్యేలు - మద్దతుదారులతో లక్నోలో అఖిలేష్ బలప్రదర్శనకు దిగారు. తండ్రిపై యుద్ధం ప్రకటించారు. ఈ సందర్భంగా ములాయం స్థానంలో అఖిలేష్ యాదవ్ను సమాజ్ వాదీ చీఫ్గా ప్రకటించారు ఆయన బాబాయ్ రాంగోపాల్ యాదవ్. ఈ సమావేశం అక్రమమని, దీనికి హాజరైన వారందరిపై చర్యలు ఉంటాయని ములాయం హెచ్చరించిన కొన్ని నిమిషాల్లోనే అఖిలేష్ ను పార్టీ రథసారథిగా ప్రకటించారు. అంతేకాదు అఖిలేష్ ను ఇరుకున పెడుతున్న ప్రత్యర్థి వర్గంలోని శివపాల్ యాదవ్ - అమర్ సింగ్ లను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ జాతీయ సదస్సులో అఖిలేష్ ను పార్టీ ఛీఫ్ గా ప్రకటించిన రాంగోపాల్... పార్టీ మూలవిరాఠ్ అయిన ములాయంను మార్గదర్శకం వ వ్యవహరించాలని కోరడం విశేషం. జై అఖిలేష్ నినాదాల మధ్య రాంగోపాల్ ఈ ప్రకటన చేశారు. పార్లమెంటరీ బోర్డును కొత్తగా నియమిస్తామని, ఈ విషయం ఎన్నికల సంఘానికి వెల్లడిస్తామని రాంగోపాల్ తెలిపారు.
కాగా అనేక ట్విస్ట్ ల మధ్య పార్టీ రథసారథిగా ఎన్నికైన తర్వాత అఖిలేష్ మాట్లాడుతూ.. తమకు నేతాజీ (ములాయం) స్థానం అత్యుత్తమమైనదని, యూపీలో మళ్లీ తమ ప్రభుత్వమే వస్తే ములాయం కంటే ఎక్కువ సంతోషించేవాళ్లు ఎవరూ ఉండరని అన్నారు. తన తండ్రి, పార్టీకి వ్యతిరేకంగా ఏదైనా కుట్ర జరుగుతుంటే దానిని అడ్డుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని అఖిలేష్ చెప్పారు. తనను రాష్ట్ర అధ్యక్షుడిగా తప్పుకోవాలని ములాయం అడిగి ఉంటే తాను దిగిపోయేవాడినని తెలిపారు. మా తండ్రీకొడుకులను ఎవరూ వేరు చేయలేరని అఖిలేష్ స్పష్టంచేశారు. యూపీ ప్రజలకు మేలు చేసే సర్కారును మరోమారు అందిస్తామని అఖిలేష్ పేర్కొన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/