Begin typing your search above and press return to search.
ఆ సీఎం రాజీనామా డేట్ ఫిక్స్ చేసిన అమిత్ షా
By: Tupaki Desk | 4 March 2017 4:17 AM GMTబీజేపీ చీఫ్ అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్య చేశారు. మినీ భారత్ ఎన్నికలుగా అభివర్ణిస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని బీజేపీ స్పెషల్ కేస్ గా తీసుకున్న సంగతి తెలిసిందే. పేరుకు ఐదు రాష్ట్రాల ఎన్నికలే అయినా.. దేశ ప్రజల దృష్టి అంతా యూపీ ఎన్నికల ఫలితం మీదనే ఉందని చెప్పక తప్పదు. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన యూపీలో అధికార పీఠాన్ని చేజిక్కించుకునే వారు జాతీయ రాజకీయాల్ని ప్రభావితం చేస్తారన్న విషయాన్ని మర్చిపోలేం. అందుకే.. యూపీ ఎన్నికల మీద ఆసక్తి వ్యక్తమవుతోంది.
ఇప్పుడు కాకుంటే మరెప్పటికీ అన్న రీతిలో.. యూపీలో పాగా వేసేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు అన్నిఇన్ని కావు. ఎట్టి పరిస్థితుల్లోనైనా.. యూపీ పీఠాన్ని సొంతం చేసుకోవాలని కమలనాథులు తహతహలాడుతున్నారు. ఇదిలా ఉంటే.. యూపీలో విజయం తమదేనన్న విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నారు అమిత్ షా. ఇప్పటివరకూ జరిగిన పోలింగ్ దశల నేపథ్యంలో.. యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ తన రాజీనామా లేఖను సిద్ధం చేసుకోవాలంటూ అమిత్ షా వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ నెల 11న మధ్యాహ్నం ఒంటి గంటకు అఖిలేశ్ తన రాజీనామా లేఖతో సిద్ధంగా ఉండాలన్నారు. యూపీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ ఓటమి ఖాయమని తేలిపోయిందని.. ఇప్పటికే ఆ విషయం తేలిపోయిందని.. అఖిలేశ్ ఇంటికి వెళ్లక తప్పదని ఆయన అభిప్రాయపడ్డారు. మొత్తం ఏడు విడతలుగా సాగే ఎన్నికల్లో ఇంకారెండు విడతలు మాత్రమే మిగిలి ఉండటం.. ఇప్పటికి జరిగిన పోలింగ్ బీజేపీకి అనుకూలంగా ఉందన్నట్లుగా అమిత్ షా వ్యాఖ్యలు ఉన్నాయి. యూపీ ముఖ్యమంత్రిని రాజీనామా లేఖతో సిద్ధంగా ఉండాలంటూ డేట్ చెప్పి.. టైమ్ కూడా చెప్పేస్తున్న అమిత్ షా వైఖరి ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. యూపీలో ఈసారి బీజేపీ గెలుపు పక్కా అన్న బలమైన అభిప్రాయాన్ని అమిత్ షా చెబుతున్నారు. మరి.. అమిత్ షా చెబుతున్న మాట ఎంతవరకు నిజమన్నది తేలాలంటే వచ్చే శనివారం మధ్యాహ్నం 12 గంటల వరకూ వెయిట్ చేయక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/