Begin typing your search above and press return to search.
సీఎంకు ఆయన కొడుక్కు పడట్లేదట
By: Tupaki Desk | 29 Dec 2015 10:02 AM GMTముఖ్యమంత్రి హోదాలో పనిచేసిన వ్యక్తి మాటను ఆయన సొంత కొడుకు వినకుంటే? అత్యంత ప్రతిష్టాత్మక కార్యాక్రమానికి డుమ్మా కొట్టేస్తే? అదికూడా రాజకీయంగా అనుమానాలు రేకెత్తించే విధంగా ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది? ఖచ్చితంగా అలాంటి పరిణామం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశం అవుతుంది.
తండ్రి అడుగుజాడల్లో తనయుడు. ఇదీ ఉత్తర్రపదేశ్ లో అధికార పార్టీ సమాజ్ వాదీ పార్టీ తీరు. గడచిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున ముమ్మర ప్రచారం సాగించిన అఖిలేశ్ యాదవ్, సొంత పార్టీ కార్యకర్తల నుంచే కాక ఓటర్ల నుంచి కాబోయే సీఎంగా చప్పట్లు కొట్టించుకున్నారు. అంతేకాదు, ఈ దఫా మీ తనయుడిని అధికార పీఠమెక్కించండి అంటూ బహిరంగ సభల్లోనే జనం ములాయం సింగ్ యాదవ్ కు చెప్పారు. జనాభిప్రాయానికి తలొగ్గిన ములాయం, కొడుకును సీఎం పీఠమెక్కించి, తాను మాత్రం పార్టీ అధ్యక్ష పదవితోనే సరిపెట్టుకున్నారు. అధికారం చేపట్టినా, తండ్రి బాటలోనే సాగుతూ వస్తున్న అఖిలేశ్, తాజాగా అందరికీ షాకిచ్చారు. ములాయం సింగ్ యాదవ్ సొంతూళ్లో ఆ పార్టీ ఏటా సయిఫాయి మహోత్సవ సంబరాలను వేడుకగా జరుపుతుంటారు.
తాజాగా ఆ వేడుకలను ములాయం సోదరుడు లాంఛనంగా ప్రారంభించారు. ఈ వేడుకకు హాజరయ్యే రాజకీయ, సినీ రంగ ప్రముఖుల కోసం ములాయం ఏకంగా ప్రత్యేక విమానాలనే సిద్ధం చేశారు. అయితే ప్రారంభ వేడుకల్లో పాల్గొనాల్సి ఉన్న అఖిలేశ్ యాదవ్ మాత్రం డుమ్మా కొట్టేశారు. దీంతో తండ్రీకొడుకుల మధ్య విభేదాలు మొదలయ్యాయన్న వార్తలు గుప్పుమన్నాయి. ఈ వార్తలకు కారణం కూడా లేకపోలేదు. పార్టీలో అఖిలేశ్ కు అత్యంత సన్నిహితులుగా పేరుపడ్డ సునీల్ సింగ్ యాదవ్, ఆనంద్ బదౌరియాలను ములాయం సస్పెండ్ చేశారు. అఖిలేశ్ కు మాట మాత్రంగా కూడా చెప్పకుండా ములాయం వారిద్దరిపై వేటు వేశారు. పార్టీ అధినేతగా ములాయం తీసుకున్న నిర్ణయాన్ని అఖిలేశ్ అంగీకరించక తప్పని పరిస్థితి. ఈ నేపథ్యంలో తండ్రి చర్యపై కాస్తంత గుర్రుగా ఉన్న అఖిలేశ్, సయిఫాయి మహోత్సవానికి డుమ్మా కొట్టారని విశ్లేషకులు భావిస్తున్నారు.
మాజీ సీఎం అయిన తండ్రికే షాక్ ఇచ్చారంటే..రాజకీయంగా ఎక్కడ దెబ్బకొట్టాలో బాగా నేర్చుకున్నారన్నట్లేనని పొలిటికల్ సర్కిల్ లో సెటైర్లు పేలుతున్నాయి.