Begin typing your search above and press return to search.
బీజేపీకి యూపీలో షాకిచ్చేందుకు అకిలేష్ రెడీ
By: Tupaki Desk | 15 Jun 2018 7:03 AM GMTఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ 2019 ఎన్నికలకు రెడీ అవుతున్నారు. తాను పోటీచేయాలనుకుంటున్న నియోజకవర్గాన్ని కూడా ప్రకటించేశాడు. వచ్చే లోక్ సభ ఎన్నికల బరిలో తాను ఉంటానని చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు. అఖిలేష్ సమాజ్ వాదీ పార్టీ తరఫున యూపీ సీఎం రేసులో ఉన్నాడు. అలాంటి వ్యక్తి ఎమ్మెల్యేగా పోటీ చేయాలి కానీ ఈసారి ఎంపీగా బరిలో నిలుస్తానని ప్రకటించడం విశేషంగా చెప్పవచ్చు.
యూపీ మాజీ సీఎం అఖిలేష్ కనౌజ్ నుంచి ఎంపీగా పోటీచేస్తానని ప్రకటించాడు. అక్కడ అఖిలేష్ భార్య డింపుల్ యాదవ్ బరిలో ఉన్నారు. వచ్చేసారి ఆమె పోటీ చేయదని.. తను పోటీచేస్తానని అకిలేష్ తెలిపారు. యూపీలో వచ్చేసారి ఆసక్తికర రాజకీయ సమీకరణాలు చోటుచేసుకోబోతున్నాయి. బీజేపీ గత ఎన్నికల్లో 90శాతం సీట్లు సాధించి రాష్ట్రం అన్ని పక్షాలను ఓడించిన సంగతి తెలిసిందే. అందుకే ఈసారి అలా కాకుండా యూపీలోని ప్రతిపాలన్నీ కలిసి బరిలో దిగాలని అఖిలేష్ ప్లాన్ చేస్తున్నారు. దీనికోసం సీట్ల త్యాగానికి సిద్ధమని అఖిలేష్ స్వయంగా ప్రకటించారు.
తన భార్యను ఎంపీగా పోటీ చేయించడం వల్ల చాలా మంది తనను విమర్శిస్తున్నారని.. అందుకే ఆమెను వచ్చేసారి ఎంపీగా పోటీచేయించనని అఖిలేష్ చెబుతున్నాడు. అలాగే వచ్చేసారి తన తండ్రి ములాయం పోటీలో ఉంటాడని అఖిలేష్ తెలిపాడు. మైన్ పురి నుంచి ములాయం పోటీలో ఉంటాడని అఖిలేష్ ప్రకటించారు. లోక్ సభ బరిలో మాజీ సీఎం నిలుస్తుండడం బీజేపీని ఓడించేందుకే అన్న ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది బీజేపీలో కలవరం రేపుతోంది.