Begin typing your search above and press return to search.
చర్చంతా ఎంఐఎం గురించే !
By: Tupaki Desk | 14 March 2022 4:58 AM GMTఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత విశ్లేషణలు చూస్తుంటే అందరిలోనూ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎన్నికల సమయంలోనే సమాజ్ వాదీ పార్టీని దెబ్బకొట్టేందుకు బీజేపీ+ఎంఐఎం అవగాహనతోనే పోటీ చేస్తున్నాయనే ప్రచారం అందరికీ తెలిసిందే.
ఇదే విషయమై ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కూడా అనేకసార్లు ఆరోపణలు చేశారు. తన ఆరోపణలను ఎంఐఎంకు మాత్రమే పరిమితం చేయకుండా బీఎస్పీ పైన కూడా ఇలాంటి ఆరోపణలే చేశారు.
అఖిలేష్ ఆరోపించినట్లు ఎంఐఎంకు బీజేపీతో ప్రత్యక్షంగా అవగాహన ఉందా లేదా అన్నది నిర్ధారణ కాదు. అయితే తాజా విశ్లేషణలు చూసిన తర్వాత మాత్రం బీజేపీ గెలుపులో ఎంఐఎం పాత్ర లేదని చెప్పలేరు. ఇంతకీ విషయం ఏమిటంటే 403 సీట్లలో ఎంఐఎం ఏరికోరి ముస్లింల ప్రాబల్యం ఎక్కువగా ఉండే 100 నియోజకవర్గాల్లో మాత్రమే పోటీ చేసింది. తాజా ఎన్నికల్లో బీజేపీ కూటమి 275 సీట్లలో గెలిచింది. అలాగే ఎస్పీ కూటమి 120 సీట్లలో విజయం సాధించింది.
బీజేపీ కూటమి గెలిచిన 275 సీట్లలో 90 మందికి వచ్చిన మెజారిటీ 200 నుంచి వెయ్యిలోపే. ఇదే సందర్భంగా ఎంఐఎం పోటీ చేసిన ఒక్క నియోజకవర్గంలో కూడా గెలవలేదు. అయితే ఎంఐఎం అభ్యర్ధులకు పడిన ఓట్లతో పోల్చుకుంటే బీజేపీ అభ్యర్ధులకు వచ్చిన మెజారిటీలు చాలా తక్కువగా నమోదైంది. వంద నియోజకవర్గాల్లో ఎంఐఎం అభ్యర్ధులకు 5-15 వేల ఓట్ల మధ్యలో పోలయ్యాయి. ఇదే నియోజకవర్గాల్లో గెలిచిన బీజేపీ కూటమి అభ్యర్ధులకు వచ్చిన మెజారిటీ 2 వేల ఓట్లే.
అంటే పోటీలో ఎంఐఎం లేకపోయినా లేదా ఎస్పీ కూటమితో కలుసున్నా ఆ ఓట్లన్నీ ఎస్పీ కూటమికే పడుండేవనటంలో సందేహంలేదు. కేవలం ఎంఐఎం విడిగా పోటీచేయటం వల్లే ముస్లిం ఓట్లలో చీలికవచ్చేసి ఎస్సీ 90 నియోజకవర్గాల్లో దారుణంగా దెబ్బతిన్నది.
ఎంఐఎం పోటీలో లేకపోయుంటే ఈ నియోజకవర్గాల్లో ముస్లిం ఓట్లన్నీ ఎస్పీ కూటమికే పడుండేవి. అదే జరుగుంటే ఫలితాలు వేరే విధంగా ఉండేవి. ఇదే పద్ధతిలో బీఎస్పీ కూడా ఎస్పీ కూటమిని గట్టిగానే దెబ్బకొట్టింది. మొత్తానికి అభివృద్ధి+సంక్షేమం కన్నా రాజకీయ ఎత్తుగడ వల్లే బీజేపీ గెలిచిందని అర్థమైపోతోంది.