Begin typing your search above and press return to search.

అనిల్‌ యాదవ్‌ కు పోటీగా అఖిలేష్‌ యాదవ్‌

By:  Tupaki Desk   |   26 March 2019 6:15 AM GMT
అనిల్‌ యాదవ్‌ కు పోటీగా అఖిలేష్‌ యాదవ్‌
X
కుల సమీకరణాలను అడ్డం పెట్టుకుని అభ్యర్థుల్ని నిలబెట్టడంలో చంద్రబాబు మహాదిట్ట. ఎక్కడ ఏ వర్గం ఆధిపత్యం ఎక్కువుగా ఉంటుందో అక్కడే ఆ కులం అభ్యర్థిని నిలబెడుతుంటారు. ఒకవేళ అలాంటి అవకాశం లేనప్పుడు ప్రత్యర్థి కులానికి చెందిన వ్యక్తితో ప్రచారం చేయిస్తుంటాడు. ఇందులో భాగంగా యూపీ మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌ తో నెల్లూరులో ప్రచారం చేయించబోతున్నారు చంద్రబాబు

నెల్లూరు జిల్లాలో యాదవుల ఓట్లు ఎక్కువ. అందుకోసమే నెల్లూరు అర్బన్‌ టిక్కెట్‌ అనిల్‌ యాదవ్‌ కు ఇచ్చింది వైసీపీ. ఇక నెల్లూరు అర్బన్‌ నుంచే మంత్రి నారాయణ పోటీ పడుతున్నారు. కాపు ఓట్లు మొత్తం గంపగుత్తగా నారాయణకు పడినా.. .యాదవుల ఓట్ల కోసం.. అలాగే అనిల్ యాదవ్‌ ని ఢీ కొట్టడం కోసం అఖిలేష్‌ యాదవ్‌ ని రంగంలోగి దించుతున్నారు చంద్రబాబు. ఏప్రిల్‌ 2న ఆయన నెల్లూరులో జరిగే బహిరంగ సభలో పాల్గొనే అవకాశాలున్నాయి. మరోవైపు మాజీ ప్రధాని దేవెగౌడ - డీఎంకే పార్టీ అధినేత స్టాలిన్‌ - కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ శౌరి కూడా రానున్నారు. ఇక, రాష్ట్రంలో పోలింగ్‌ ముగిసిన అనంతరం చంద్రబాబు నాయుడు కూడా ఇతర రాష్ట్రాల్లో ప్రచారానికి వెళ్తారు. ఇప్ప‌టికే జాతీయ నేత‌ల షెడ్యూల్ కు అనుగుణంగా నియోజ‌క‌వ‌ర్గాలు...ప్ర‌చార షెడ్యూల్ ఖ‌రారు చేస్తున్నారు.

జాతీయ నేత‌ల ప్ర‌చారంలోనూ టిడిపి సామాజిక వ‌ర్గాల వారీగా ప్ర‌భావం చూపించేలా వ్యూహాలు సిద్దం చేసింది. ఫ‌రూక్ అబ్దుల్లా ను పూర్తిగా ముస్లిం మైనార్టీ వ‌ర్గాల ప్రాబ‌ల్యం ఎక్కువ‌గా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ర్య‌ట‌న ఖ‌రారు చేసారు. తమిళ‌నాడు ఓట‌ర్లు నివాసం ఉండే ఏపి ప్రాంతాలైన న‌గ‌రి - సూళ్లూరు పేట వంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో డిఎంకె నేత స్టాలిన్‌ - విశాఖ‌లో మ‌మ‌తా బెన‌ర్జీ - విజ‌య వాడ‌లో కేజ్రీవాల్ ప‌ర్య‌టించి టిడిపికి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేయ‌నున్నారు.