Begin typing your search above and press return to search.

చంద్రబాబుకి ఝలక్‌ ఇచ్చిన అఖిలేష్‌

By:  Tupaki Desk   |   26 Dec 2018 1:23 PM GMT
చంద్రబాబుకి ఝలక్‌ ఇచ్చిన అఖిలేష్‌
X
బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని కంకంణం కట్టుకున్న చంద్రబాబు.. ఇందులో భాగంగా.. మోదీ వ్యతిరేకులందర్ని ఒక తాటిపై తెచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కమ్యూనిష్టు నాయకుల్ని - స్టాలిన్‌ - మమతా - అఖిలేష్‌ యాదవ్‌ లాంటి నేతల్ని కలిశారు. ఇప్పటికీ అవకాశం ఉన్నప్పుడల్లా కలుస్తూనే ఉన్నారు. ఎప్పుడూ ఎవ్వర్నీ కలిసినా అందరూ కలిసి మోదీని ఓడిద్దా అని స్లోగన్స్‌ ఇస్తున్నారు.

ఇప్పుడు ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరుతో కేసీఆర్‌ రంగంలోకి దిగారు. చంద్రబాబు గతంలో ఎవరిని అయితే కలిశారో.. వారందర్ని వరుసపెట్టి కలిశారు. ఒడిషా సీఎం నవీన్‌ పట్నాయక్‌ తో మంతనాలు జరిపారు. ఆ తర్వాత అటునుంచి అటు బెంగాల్‌ వెళ్లారు. మమతను కలిశారు. ఇప్పుడు వంతు అఖిలేష్‌ యాదవ్‌ ది. లెక్కప్రకారం కేసీఆర్‌ ఇవాళ అఖిలేష్‌ ని కలవాలి. కానీ అనివార్య కారణాల వల్ల కుదరలేదు. ఈ టైమ్‌ లో అఖిలేష్‌ యాదప్‌ ఒక ప్రకటన చేశారు. కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ కు తాను పూర్తి మద్దతునిస్తున్నానని. ఈ ప్రకటనతో బాబుని ఇరకాటంలో పడేశాడు అఖిలేష్‌. ఆయన కేసీఆర్‌ కి మద్దతిస్తే.. మరి బాబు పరిస్థితి ఏంటి. దీంతో… బాబు శిబిరంలో కాస్త ఆందోళన మొదలైంది. తన ప్రయత్నాల్ని తిప్పి కొట్టేందుకు కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని.. ఇదంతా మోదీ ప్లాన్‌లో భాగమని.. టీడీపీ వర్గాలు ఇప్పటికే కౌంటర్లు ఇవ్వడం మొదలుపెట్టాయి. చూద్దాం.. ఫైనల్‌ గా మూడో ఫ్రెంట్‌ ని ఏర్పాటు చేయబోయే మొనగాడు ఎవరు అవుతారో.