Begin typing your search above and press return to search.
అఖిలేశ్ భావోద్వేగం.. మద్దతుదారుల ఆవేశం
By: Tupaki Desk | 31 Dec 2016 8:54 AM GMTయూపీ రాజకీయాలు సర్వ హంగులు ఉన్న ఫార్ములా సినిమాల్లా మారిపోయాయి. ఎత్తుకుపైఎత్తులు - విద్వేషాలు - విభేదాలు - కోపతాపాలు.. మళ్లీ ప్రేమానురాగాలు... అదే సమయంలో పోటీ అన్ని రకాల షేడ్లతో రక్తి కడుతున్నాయి. తాజాగా తన బహిష్కరణ తరువాత కూడా అఖిలేశ్ నాన్న ములాయం సింగ్ పై ఏమాత్రం కోపం చూపించడం లేదు. తనను పార్టీ నుంచి బహిష్కరించారే కానీ కుటుంబం నుంచి కాదని ఆయన చెబుతున్నారు. ఈ రోజు మంత్రులు - ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు - మద్దుతుదారులతో సమావేశమైన ఆయన భావోద్వేగానికి గురయ్యారు. తాను ఇప్పటికీ నాన్నతోనే ఉన్నానని ఆయన అన్నారు.
తాను పార్టీకి దూరమైనా కుటుంబానికి దగ్గరగానే ఉంటానన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని గెలిపించి.. దానిని నాన్న ములాయంకు బహుమతిగా ఇద్దామని అఖిలేశ్ ప్రతిపాదించారు. ఈ భేటీ అనంతరం తనకు అండగా నిలిచిన ఎమ్మెల్యేల జాబితాతో కూడా ముందుగా తండ్రి ములాయం ఆశీర్వాదం తీసుకునేందుకే ఆయన బయలుదేరారు.
కాగా ఎస్పీని చీల్చి సొంతంగా పార్టీ పెట్టే దిశగా అఖిలేశ్ సాగుతున్నట్టు తెలుస్తోంది. ఆయన ఎస్పీ నుంచే కాకుండా జాతీయ నేతల మద్దతు కూడా లభిస్తుండటం గమనార్హం. ఇప్పటికే బెంగాల్ సీఎం మమతాబెనర్జీ అఖిలేశ్ ఫోన్ చేసి మాట్లాడగా.. కాంగ్రెస్ పార్టీ ఆయనతో పొత్తుకు సై అని సంకేతాలు ఇచ్చింది. మరోవైపు తండ్రీతనయుల మధ్య వివాదానికి కారణమైన బాబాయి శివపాల్ మాత్రం తాజా పరిణామాలతో కంగారుపడుతున్నారట. అఖిలేశ్ ను బహిష్కరిస్తే అంతా తమ వైపు తిరుగుతారని అనుకున్నా అందుకు భిన్నంగా అంతా అఖిలేశ్ కే మద్దతు పలుకుతుండడంతో శివపాల్ షాకైనట్లు తెలుస్తోంది.
కాగా అఖిలేశ్ సమావేశానికి మొత్తం 12 మంది మంత్రులు - 150 మంది ఎమ్మెల్యేలు - 35మంది ఎమ్మెల్సీలు వచ్చారు. దీంతో ఎస్పీపై సీఎం అఖిలేశ్ పట్టు వదల్లేదని స్పష్టమవుతోంది. మెజారిటీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆయనకే మద్దతు పలికారు. దీంతో పార్టీని చీలుస్తారా.. లేదంటే పార్టీని తనపరం చేసుకుని తన వ్యతిరేకులను బహిష్కరిస్తారా అన్నది చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/