Begin typing your search above and press return to search.
అఖిలేష్ బస్సుకు ఆదిలోనే యాక్సిడెంట్
By: Tupaki Desk | 3 Nov 2016 7:13 AM GMTఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ఈ ఉదయం ప్రారంభించిన వికాస్ రథయాత్ర గందరగోళంగా మొదలైంది. కొద్దికాలంగా పార్టీలో - కుటుంబంలో ఉన్న తీవ్ర విభేదాల నేపథ్యంలో అఖిలేశ్ - ఆయన బాబాయి శివపాల్ వర్గీయులు కొట్టుకోవడంతో యాత్ర రసాభసగా మారింది. లక్నోలో ప్రారంభమైన ఈ యాత్రకు అధిక సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. అఖిలేష్ వర్గం - శివపాల్ వర్గాలు బాహాబాహీకి దిగాయి. రెండు వర్గాల కార్యకర్తలు కర్రలతో ఒకరిని ఒకరు కొట్టుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు చాలా సేపు శ్రమించాల్సి వచ్చింది. పలుమార్లు లాఠీచార్జ్ చేసిన పోలీసులు కార్యకర్తలను చెల్లాచెదరు చేశారు.
మరోవైపు అఖిలేశ్ దీన్ని చాలా చిన్న ఘటనగా అభివర్ణించారు. వచ్చే సంవత్సరం ఉత్తరప్రదేశ్ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా - ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఈ 'వికాస్ రథ యాత్ర'ను మొదలుపెట్టారు. రథయాత్రకు భారీ ప్రచారం చేశారు. సకల సౌకర్యాలున్న బస్సులో సాగుతున్న ఈ యాత్ర ఆరంభంలోనే ఇలా గొడవలు చెలరేగడంతో ముందుముందు ఎలా ఉంటుందో అని అంటున్నారు.
కాగా ప్రతిష్ఠాత్మక ఈ యాత్రకు అధికార సమాజ్ వాదీ పార్టీ సుప్రీమో ములాయం సింగ్ యాదవ్ హాజరవుతారా? అన్న సంగతిపై సస్పెన్స్ కొనసాగుతోంది. పార్టీని అధికారంలోకి తేవడం లక్ష్యంగా ఆయన యాత్రంలో పాల్గొంటారా లేదంటే కొడుకుతో విభేదాల నేపథ్యంలో దూరంగా ఉంటారా అన్నది చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/