Begin typing your search above and press return to search.

నల్ల ధనం గొప్పతనం గురించి చెప్పిన సీఎం

By:  Tupaki Desk   |   15 Nov 2016 2:14 PM GMT
నల్ల ధనం గొప్పతనం గురించి చెప్పిన సీఎం
X
పెద్ద నోట్ల రద్దుపై ప్రధాని మోడీ ప్రకటన తర్వాత యావత్ జాతి ఒక భారీ షాక్ కు గురైందని చెప్పాలి. ఇందుకు రాజకీయ నేతలు సైతం మినహాయింపు లేదు. వారు తేరుకొని.. అసలేం జరుగుతుంది? ఏం జరగనుందన్న విషయం అర్థం కావటానికి వారికి కొంత టైం పట్టిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితి నుంచి.. బ్యాంకుల నుంచి ప్రజలు డబ్బులు తీసుకోవటానికి.. ఏటీఎంల కోసం పడుతున్న కస్టాల నేపథ్యంలో నేతలు ఒక్కొక్కరుగా గళం విప్పుతున్నారు. మోడీ తీసుకున్న చర్యనుతప్పు పడుతూ ఎవరికి తోచిన స్టేట్ మెంట్లు వారు ఇస్తున్నారు.

నేతలు ఇంతగా మాట్లాడుతున్నా.. నోట్ల రద్దుపై ప్రజలు వ్యతిరేకంగా లేరన్న విషయాన్ని మర్చిపోకూడదు. ప్రజలకు కానీ బ్యాంకు.. ఏటీఎం ఇబ్బందులు కానీ లేకపోతే.. మోడీ నిర్ణయానికి ప్రజలు పండగ చేసుకునే వారని చెప్పక తప్పుదు. అయితే.. ప్రజలకు అవసరమైన చిల్లర నోట్లను సకాలంలో వారికి అందేలా చేయటంలో కేంద్రం చేసిన పొరపాట్లు ఈ రోజు విపక్షాలు ఏకమయ్యేలా చేయటమే కాదు.. వారు నోరు విప్పి నాలుగు మాటలు చెప్పేందుకు అవకాశం ఇచ్చిందని చెప్పాలి.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. పెద్దనోట్ల రద్దు తప్పుడు నిర్ణయం అంటూ సూటిగా విమర్శలు చేస్తున్న నేతలు సైతం చాలా తక్కువని చెప్పక తప్పదు. యూపీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ నే చూడండి. ఆయన బ్లాక్ మనీ నిరోదానికి మోడీ సర్కారు తీసుకున్న చర్యలకు తాజా నిర్ణయం ఏ మాత్రం పనికి రాదని చెబుతూనే.. అవినీతికి చెక్ పెట్టటానికి మాత్రం ఇది సరిపోతుందని చెప్పుకొచ్చారు. నోట్ల రద్దు అంశంపై మాట్లాడే క్రమంలో ఆయన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యల్ని చూస్తే..

= నల్లధనం ఉత్పత్తి చేయరాదు.ఈ విషయంలో నేను చాలా స్పష్టంగా ఉన్నా. కానీ.. ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభంలో కూరుకున్నప్పుడు భారత్.. ఆ పరిస్థితుల నుంచి బయట పడేసింది మాత్రం నల్లధనమే. ఎందుకంటే ప్రపంచ ఆర్థికసంక్షోభానికి సమాంతరంలో భారత్ లో బ్లాక్ మనీ ఉండటమే.

= నేను బ్లాక్ మనీని వ్యతిరేకిస్తున్నా. నాకు అస్సలు ఆ డబ్బే అక్కర్లేదు.

= నల్లధనాన్ని బయటకు తెచ్చేందుకు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలు వల్ల ప్రజలు బ్యాంకులు.. ఏటీఎంల వద్ద క్యూలో నిలుచోవాల్సిన పరిస్థితి చోటు చేసుకుంది.

= నోట్ల రద్దుతో బ్లాక్ మనీకి చెక్ పెట్టటానికి ఈ వ్యవహారం ఎలాంటి ప్రయోజనాన్ని కలిగించదు.

= అవినీతిని చెక్ చెప్పటానికి మాత్రం ఇదో చక్కటి చర్య. దీనిపై చాలామంది ప్రజలు అవగాహన పొందుతారు.

= ఎవరైతే నల్లధనాన్ని పెద్దనోట్లలో దాచి పెట్టి ఉంచుకున్నారో.. వారు మాత్రమే ఇప్పుడు రూ.2వేల నోట్ల కోసం వెయిట్ చేస్తుంటారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/