Begin typing your search above and press return to search.

సంచలన ప్రకటన చేసిన అఖిలేష్ యాదవ్..ఏంటంటే ?

By:  Tupaki Desk   |   1 Nov 2021 9:33 AM GMT
సంచలన ప్రకటన చేసిన  అఖిలేష్ యాదవ్..ఏంటంటే ?
X
సమాజ్ వాదీ పార్టీ అధినేత , యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ పాలిటిక్స్ నుంచి వైదొల‌గ‌నున్న‌ట్టు సంచలన ప్రకటన చేశారు. రాబోయే ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల 2022లో పోటీ చేయడం లేదని ప్రకటించారు. తాను చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకుంటున్నానని, రాష్ట్రీయ లోక్‌ దళ్‌ తో పొత్తు ఖరారైందని, సీట్ల పంపకం గురించి ఇంకా మాట్లాడలేదని అఖిలేష్ అన్నారు. ఎన్నికల్లో చాచా శివపాల్ యాదవ్‌ కు చెందిన ప్రగతిశీల సమాజ్‌వాదీ పార్టీ లోహియా (పిఎస్‌ పిఎల్)ని తీసుకునే అవకాశంపై అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. “నాకు దానితో ఎటువంటి సమస్య లేదు. వారికి వారి ప్రజలకు తగిన గౌరవం ఇవ్వబడుతుంది అన్నారు.

మరోవైపు అఖిలేష్ యాదవ్ చేసిన జిన్నా ప్రకటనపై రాజకీయాలు యూపీ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌పై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎదురుదాడికి దిగారు. పటేల్‌ను జిన్నాతో పోల్చడం సిగ్గుచేటని సీఎం యోగి అన్నారు. అఖిలేష్ యాదవ్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విభజన మనస్తత్వాన్ని ప్రజలు అంగీకరించరని.. ఎస్పీ జాతీయ అధ్యక్షుడి ప్రకటన చాలా సిగ్గుచేటని ముఖ్యమంత్రి యోగి అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశ ఐక్యత, సమగ్రతకు రూపశిల్పి అని వెల్లడించారు.ఇదీ తాలిబనీ మనస్తత్వం అని సీఎం యోగి అన్నారు.

ఇటీవ‌ల రైతుల‌ను కేంద్ర మంత్రి కుమారుడి వాహ‌నం తొక్కించ‌డం, ద‌ళిత యువ‌తు ల‌పై హ‌త్యాచారాలు, త‌దిత‌ర ప్ర‌జా వ్య‌తిరేక ఘ‌ట‌న‌లు యోగి ఆదిత్య‌నాథ్ ప్ర‌భుత్వంపై తీవ్ర వ్య‌తిరేక‌త‌కు కార‌ణాల‌య్యాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. దీంతో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ లో అధికార మార్పిడి త‌ప్ప‌ద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. బీజేపీ పాల‌న‌పై వ్య‌తిరేక‌త‌ అంతిమంగా అఖిలేశ్ యాద‌వ్‌ కు క‌లిసి వ‌స్తుంద‌ని, మ‌ళ్లీ ఆయ‌నే సీఎం అవుతార‌ని అనుకుంటున్న త‌రుణం లో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న రావ‌డం గ‌మ‌నార్హం. మీడియాతో ఆయ‌న మాట్లాడుతూ తాను అసెంబ్లీ ఎన్నిక‌ల బ‌రి నుంచి త‌ప్పుకుంటున్న విష‌యాన్ని చెప్పారు.