Begin typing your search above and press return to search.
అసద్ తో పొత్తు పెట్టుకోనంటున్నాడు.. కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం
By: Tupaki Desk | 2 Dec 2021 3:39 AM GMTవచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల గురించి యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు యూపీ అసెంబ్లీ ఎన్నికలు ఒక లాంటి సెమీ ఫైనల్స్ గా పలువురు అభివర్ణిస్తారు. దేశంలో అత్యధిక ఎంపీ స్థానాలున్న రాష్ట్రమైన యూపీలో చోటు చేసుకునే రాజకీయ పరిణామాలు దేశ రాజకీయాల మీద కచ్ఛితంగా ప్రభావాన్ని చూపించక మానవు. అందుకే..యూపీ అసెంబ్లీ ఫలితాల మీద అంత ఆసక్తి వ్యక్తమవుతోంది.
ఇప్పటివరకు పలు మీడియా సంస్థలు చేసిన సర్వేల ప్రకారం.. యోగి సర్కారు మరోసారి కొలువు తీరుతుందన్న మాట బలంగా వినిపిస్తున్నప్పటికీ.. వాస్తవం అంత సులువుగా ఏమీ లేదని.. గుర్రం ఎగరా వచ్చన్న మాట వినిపిస్తోంది. ఇలాంటివేళ.. ఎన్నికలకు ముందు చోటు చేసుకునే పొత్తులు.. జట్టు కట్టే కూటములు కూడా ఎన్నికల ఫలితాల మీద తీవ్ర ప్రభావాన్ని చూపించే వీలుందన్న మాట వినిపిస్తోంది. ఇలాంటివేళ.. యూపీ మాజీ సీఎం కమ్ సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
దేశంలోని పలు రాష్ట్రాల్లో పోటీకి దిగటం ద్వారా.. తనదైన ఓటు బ్యాంకును పెంచుకోవటం ద్వారా.. ఎవరో ఒకరికి కచ్ఛితంగా నష్టాన్ని చేకూరుస్తున్న మజ్లిస్ పార్టీ.. యూపీ ఎన్నికల్లో కీలకభూమిక పోషించే వీలుందన్న మాట వినిపిస్తోంది. ఇలాంటి వేళ.. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీతో మీరు పొత్తు కుదుర్చుకుంటారా? అని అఖిలేశ్ ను అడిగితే ఆయన నో అంటే నో అనేస్తున్నారు. సమాజ్ వాదీ పార్టీ ఇప్పటికే పొత్తుల్ని ఖరారు చేసుకుందని స్పష్టం చేశారు. మజ్లిస్ తో పొత్తు కుదుర్చుకున్న పక్షంలో మైనార్టీల ఓట్లను సమీకరించే వీలుందన్న వాదన వినిపిస్తోంది. అదే జరిగితే సమాజ్ వాదీకి అవకాశాలు మెరుగుపడతాయని చెబుతున్నా.. సెక్యులర్ ఓటు బ్యాంక్ చెల్లాచెదురు అవుతుందన్న ఆలోచనతోనే అఖిలేశ్ నో చెబుతున్నట్లుగా చెబుతున్నారు.
మజ్లిస్ కు నో చెప్పిన అఖిలేశ్.. అందుకు భిన్నంగా కొన్ని చిన్న పార్టీలతో పొత్తు విషయమై చర్చలు జరుపుతున్నారు. త్వరలోనే వాటితో సీట్ల లెక్కలు ఖరారు చేసుకోనున్నట్లు చెబుతున్నారు. అయితే.. మజ్లిస్ తో మాత్రం పొత్తు పెట్టుకునే ఆలోచన లేదని తేల్చారు. యూపీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది ఫిబ్రవరి - మార్చి మధ్యలో జరగనున్నాయి. మొత్తం 403 స్థానాలు ఉన్న అసెంబ్లీలో ఎవరు పాగా వేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో తమకు 300 స్థానాలు ఖాయమని బీజేపీ నేతలు ధీమాను వ్యక్తం చేస్తుంటే.. అంత సీన్ లేదని.. తాము సత్తా చాటతామని సమాజ్ వాదీ అధినేత చెబుతున్నారు. ప్రస్తుతం యూపీ అసెంబ్లీలో 312 స్థానాల్లో బీజేపీ ఉండగా.. ఎస్పీకి 47 స్థానాలు.. బీఎస్పీకి 19 స్థానాలు ఉన్నాయి. కాంగ్రెస్ కు కేవలం ఏడు స్థానాల్లో మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తోంది. మరి.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు నమోదవుతాయో చూడాలి.