Begin typing your search above and press return to search.

ముగ్గురు కలిస్తే మోదీకి మూడినట్లేనా

By:  Tupaki Desk   |   24 Jan 2019 4:30 PM GMT
ముగ్గురు కలిస్తే మోదీకి మూడినట్లేనా
X
సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. మోదీని ఎలాగైనా సరే గద్దె దించాలని విపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. అయితే.. విపక్షాలన్నింటికిలో కేవలం మూడంటే మూడు పార్టీలు ఏకమైతే చాలు.. మోదీ గద్దెదిగడం ఖాయమని ఇండియా టుడే – కార్వీ ఇన్‌ సైట్స్‌ నిర్వహించిన మూడ్‌ ఆఫ్‌ ద నేషన్‌ పోల్‌ లో వెల్లడైంది. ఆ మూడు పార్టీలు ఎస్పీ - బీఎస్పీ - తృణమూల్‌ కాంగ్రెస్‌. ఎస్పీ - బీఎస్పీ పార్టీలకు ఉత్తరప్రదేశ్‌ - బిహార్‌ లో మంచి పట్టుంది. తృణమూల్‌ కాంగ్రెస్‌ బెంగాల్‌ లో అధికారంలో ఉంది. ఎక్కువమంది ఎంపీలు ఈ రాష్ట్రాల నుంచే వస్తున్నారు. ఈ మూడు పార్టీలకి కలిపి వచ్చే ఎన్నికల్లో 269 సీట్ల వరకు వస్తాయని సర్వే అంచనా వేసింది. ఇక బీజేపీ నేతృత్వంలోని ఎన్టీయేకు 219 స్థానాలు వస్తాయి. ఓట్ల శాతం పరంగా చూస్తే యూపీఏ 44 - ఎన్డీఏ 35 - ఇతరులు 21 శాతం ఓట్లు దక్కించుకుంటారు. 269 సీట్లు తెచ్చుకున్న వాళ్లకి మ్యాజిక్‌ ఫిగర్‌ అందుకోవడం పెద్ద కష్టమేమి కాదు.

ప్రస్తుతానికి అయితే.. ఎస్పీ - బీఎస్పీ రెండూ ఏకమయ్యాయి. వీరికి మమతా బెనర్జీ కలుస్తారా లేదంటే బయటి నుంచి మద్దతు ఇస్తారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ముగ్గురికి కాంగ్రెస్‌ కూడా తోడైతే.. మోదీ గద్దెదిగడం ఖాయం. అయితే.. మాయావతి - అఖిలేష్‌ యాదవ్‌ - మమతా బెనర్జీ.. ఈ ముగ్గురు కలిసి పోటీ చేస్తారా లేదా అనేదే డౌట్‌. ఒకవేళ చేసినా.. ప్రధాన మంత్రి కుర్చీ దగ్గర మళ్లీ గొడవలు తప్పవు. దీంతో.. ఈ ముగ్గుర్ని ఎలాగైనా కలిపి వచ్చే ఎన్నికల్లో మోదీని దింపాలనే లక్ష్యంతో పావులు కదుపుతున్నారు రాహుల్‌ గాంధీ. మరి రాహుల్‌ ప్లాన్స్‌ వర్కవుట్‌ అవుతాయో లేదో వెయిట్‌ అండ్‌ సీ.