Begin typing your search above and press return to search.
సైకిల్ గుర్తు సీఎం రచ్చ ఇలా..మాజీ సీఎం అలా
By: Tupaki Desk | 9 Jan 2019 5:24 PM GMTఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ తాజాగా ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఫొటో రాజకీయ నేతల దృష్టిని ఆకర్షిస్తోంది. అఖిలేశ్ తన భార్య డింపుల్ యాదవ్ - పిల్లలతో కలిసి సరదా సమయంలో ఉన్న ఫొటోను అఖిలేశ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఎందుకు ఈ ఫొటో వైరల్ అయింది అంటే...అక్రమ మైనింగ్ లీజు కేసులో ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ కు సీబీఐ ఉచ్చు బిగుస్తున్న సంగతి తెలిసిందే. అఖిలేశ్ యాదవ్ 14 మైనింగ్ లీజులకు అక్రమంగా అనుమతి జారీ చేసినట్లు సీబీఐ ఆరోపిస్తుంది. ఈ కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు అఖిలేశ్ ను ప్రశ్నించేందుకు సిద్ధమయ్యారు.
ఇదంతా ఇలా ఉంటే అఖిలేశ్ యాదవ్ మాత్రం ఈ అంశాన్ని చాలా తేలికగా తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. తన భార్య డింపుల్ యాదవ్ - పిల్లలతో కలిసి సరదా సమయంలో ఉన్న ఫొటోను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన అఖిలేశ్...``సీబీఐ దాడులపై బాధ ఎందుకు..? నేను వార్తల్లోకి ఎందుకొచ్చానో ప్రపంచమంతా తెలుసు... నన్ను చెడుగా చూపించే వార్తలతో బాధపడాల్సిన అవసరమేముంది? అని అఖిలేశ్ కామెంట్ పోస్ట్ చేశారు.
మాజీ సీఎం అఖిలేశ్ తమ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో.. సుమారు 14 మైనింగ్ లీజులను అక్రమంగా జారీ చేసినట్లు సీబీఐ ఆరోపిస్తున్నది. హమిర్ పూర్ లో ఆ మైనింగ్ లీజులు ఉన్నాయి. తమ ప్రభుత్వమే ప్రవేశపెట్టిన ఈ-టెండర్ విధానంలో.. మాజీ సీఎం అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. మైనింగ్ లీజుకు సంబంధించి అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా అఖిలేశ్ అతిక్రమించినట్లు సీబీఐ ఆరోపిస్తున్నది. 2013 - ఫిబ్రవరి 17వ తేదీన.. ఒక్క రోజే మొత్తం 13 లీజులకు పర్మిషన్ ఇచ్చారని మాజీ సీఎంపై ఆరోపణలు ఉన్నాయి.
అయితే, ఇదే సమయంలో అదే సైకిల్ గుర్తున్న తెలుగు నేలకు చెందిన పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ రథసారథి చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు చెందిన వ్యాపారాలపై - వ్యవహారాలపై దాడులు జరుగుతున్నా..గగ్గోలు పెడుతున్నారు. తనను టార్గెట్ చేశారని వాపోతున్నారు. దాడులు జరగవచ్చని భయకంపితులు అవుతున్నారు. సైకిల్ గుర్తున్న రెండు వేర్వేరు పార్టీలకు చెందిన నేతలు ఒకరు ధైర్యంగా ఉంటే..మరొకరు ఇలా వణికిపోవడం ఆశ్చర్యకరంగా ఉందనే చర్చ జరుగుతోంది.