Begin typing your search above and press return to search.

తమ్ముడు తమ్ముడే..పేకాట పేకాటే: అఖిలేష్

By:  Tupaki Desk   |   18 Jan 2017 6:33 AM GMT
తమ్ముడు తమ్ముడే..పేకాట పేకాటే: అఖిలేష్
X
మామను వెన్నుపోటు పొడిచిన అల్లుడు.. సీఎం పదవి మీద దురాశతో ఎక్కువ చేసిన యువనేత.. ఇలాంటి ఉదంతాల గురించి యూపీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ కు అవగాహన ఉందా? ఓపక్క తన మాటను నెగ్గించుకుంటూనే.. ఎవరూ విమర్శించకుండా చూసుకోవటమే కాదు.. ప్రత్యర్థులు సైతం శభాష్ అనిపించేలా వ్యవహరిస్తున్న ఆయన తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే అన్న చందంగా ఆయన వ్యవహరిస్తున్న తీరు ఆసక్తికరంగా మారింది. చిత్రమైన విషయం ఏమిటంటే.. ఒక చేత్తో చప్పట్లు కొట్టలేం. రెండు చేతులు కలవందే కానీ అది కుదరదు. కానీ..ఒంటి చేత్తోనే చప్పట్లు వినిపించినట్లుగా చేస్తున్న అఖిలేశ్ తెలివిని చూసి ముచ్చట పడాల్సిందే. ఓ పక్క తండ్రిని రాజకీయంగా దెబ్బేస్తూనే.. మరోవైపు ఆయనతో వ్యక్తిగత సంబంధాలు మిస్ కాకుండా చూసుకోవటం.. ఆయనకు ఇవ్వాల్సిన గౌరవ మర్యాదల్ని ఎంతమాత్రం తగ్గకుండా చూడటం కనిపిస్తుంది. ఇదంతా చూసినప్పుడు వివిధ రాష్ట్రాల్లో సమకాలీన రాజకీయాల్లో పలువురు అధినేతలు చేసిన తప్పుల్ని తాను చేయకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లుగా అనిపించక మానదు.

ఓపక్క తండ్రిని వ్యతిరేకిస్తూ.. ఆయనకు ఎదురుదెబ్బ తగిలేలా పావులు కదిపి.. అందులో విజయం సాధించిన వెంటనే.. భార్యను తీసుకొని తండ్రి దగ్గరకు వెళ్లటం ఆయన ఆశీర్వాదం తీసుకోవటం అఖిలేశ్ రాజకీయ చతురతకు నిదర్శనంగా చెప్పాలి. ఈ సందర్భంగా ములాయంను కూడా మెచ్చుకోవాల్సిందే. తన దగ్గరకు వచ్చిన కొడుకును ఛీ కొట్టకుండా హుందాగా వ్యవహరించటంద్వారా.. పాడు రాజకీయాల్ని వ్యక్తిగత సంబంధాలు దెబ్బ తీసుకోకుండా ఉన్నారన్న భావన కలిగేలా చేశారని చెప్పాలి. అయితే.. ఈ వ్యవహారంలో క్రెడిట్ మొత్తం అఖిలేశ్ సొంతం చేసుకున్నారు.

దెబ్బ తిన్న పెద్దాయన దారికి వచ్చారన్న మాట ములాయంకు మిగిలింది. అయితే.. తన దగ్గరకు వచ్చిన కొడుకుతో.. తన వర్గానికిచెందిన వారికి టికెట్లు ఇవ్వాలని కోరటం ద్వారా.. సమాజ్ వాదీ పార్టీ చీలిపోదన్న సంకేతాలు ఇచ్చినట్లుగా చెప్పాలి. ఒకవేళ చీలిపోతే తనకెంత నష్టమన్న విషయం ములాయంకు తెలియంది కాదు.

అదే సమయోం తండ్రిని దూరం చేసుకుంటే తనకు పడే దెబ్బ మామూలుగా ఉండదని.. మైనార్టీ ఓట్ల మీద ప్రభావం చూపిస్తే.. తాను అనుకున్నట్లుగా పవర్ లోకి రావటం కష్టమన్న విషయం అఖిలేశ్ కు తెలియంది కాదు. అందుకేనేమో.. ఓపక్కన టెక్నికల్ గా తండ్రిని తన దారికి తెచ్చుకుంటూ.. తెలివిగా పార్టీ మొత్తం తాను అనుకున్నట్లు నడిచేలా చేయటంలో అఖిలేశ్ ఐడియాను మెచ్చుకోవాల్సిందే.మరి..తండ్రి కోరిన 40 మంది జాబితాను ఓకే చేస్తారా? అన్నది ఇప్పుడు వస్తున్న ప్రశ్న. ఏమైనా.. అఖిలేశ్ వేస్తున్న అడుగులు చూస్తే.. ఆవేశంతోనే.. అత్యాశతోనో వ్యవహరిస్తున్నట్లు కాకుండా.. బీజేపీకి యూపీ పీఠం దక్కకుండా పోరాడుతున్నాడన్న భావన కలిగేలా చేయటంలో సక్సస్ అవుతున్నారని చెప్పక తప్పదు. మరి.. ఆయనతన అంతిమ లక్ష్యానికి చేరుకుంటారా? లేదా? అన్నది రానున్న రోజుల్లో తేలిపోనుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/