Begin typing your search above and press return to search.
పరువు తీసింది ఎవరో చెప్తే చెబితే 11 లక్షలు ఇస్తా!
By: Tupaki Desk | 5 Aug 2018 2:30 PM GMTసమాజ్ వాదీ పార్టీ నేత - ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కు పరువు సమస్య ఎదురవుతోంది. చిన్న వయసులోనే సీఎం అవడం ద్వారా ప్రత్యేక గుర్తింపు పొందిన అఖిలేష్ ఇటీవల చేసిన పనితో పరువు పోగొట్టుకున్న సంగతి తెలిసిందే. మాజీ ముఖ్యమంత్రులు ప్రభుత్వ బంగ్లాలో నివాసం ఉండరాదని - వెంటనే ఖాళీ చేయాలని సుప్రీం కోర్టు ఇటీవల ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ ఆదేశాలను పాటించేందుకు ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ససేమిరా అన్నారు. అయితే, ఎట్టకేలకు ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేశారు. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో విక్రమాదిత్య మార్గ్ లో ఉన్న బంగ్లాకు సంబంధించిన తాళాలను అధికారులకు అప్పగించారు. అనంతరం ఆయన ఏపీఐ అన్సల్ సిటీలోని ఓ ప్రైవేట్ విల్లాకు మారారు. అయితే, ఈ సందర్భంగా అఖిలేష్ యాదవ్ వ్యవహరించిన తీరుపై ఆ రాష్ట్ర ఎస్టేట్ డిపార్ట్ మెంట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకంటే...స్విమ్మింగ్ పూల్ కోసం టర్కిష్ నుంచి దిగుమతి చేసుకున్న టైల్స్ - ఫ్లోర్స్ కోసం కొనుగోలు చేసిన ఖరీదైన ఇటాలియన్ మార్బుల్స్ ను తవ్వి పట్టుకెళ్లారు. ఏసీలు - దిగుమతి చేసుకున్న సీలింగ్ - గార్డెన్ లైట్లు - అద్దాలు - బాత్ రూమ్ ఫిట్టింగ్స్ - తదితర సామాగ్రి బంగ్లా నుంచి మాయమయ్యాయని అధికారులు తెలిపారు. మరీ ముఖ్యంగా జిమ్ లో ఉన్న పరికరాలు మొత్తం ఖాళీ చేశారని వివరించారు. అంతటితో ఆగకుండా విదేశాల నుంచి కొనుగోలు చేసిన ఖరీదైన అరుదైన మొక్కలను కూడా వారితో పాటే తీసుకెళ్లారని చెప్పారు.
దీంతో ఈ యువనేత పరువు బజారు పాలయింది. ఈ పరిణామం వైరల్ అయిన నేపథ్యంలో తాజాగా అఖిలేశ్ స్పందించారు. అంతేకాకుండా ఓ సంచలన ప్రకటన కూడా చేశారు. తాను ఖాళీ చేసిన అధికారిక బంగ్లాకు తీవ్ర నష్టం వాటిల్లేలా చేశారన్న ఆరోపణలను ఖండించారు. తాను జూన్ 2న బంగ్లాను ఖాళీ చేసిన తర్వాత కొందరు వ్యక్తులు అందులోకి వెళ్లి విలువైన వస్తువులను ధ్వంసం చేశారని - వాళ్లెవరో చెబితే తాను రూ.11 లక్షలు ఇస్తానని ప్రకటించారు. తనపై నింద మోపడానికే ఎవరో కావాలనే ఈ పని చేశారని ఆయన స్పష్టం చేశారు. జర్నలిస్టులైనా సరే ఆ వ్యక్తుల ఆచూకీ చెప్పిన వాళ్లకు రివార్డు ఇస్తామని అఖిలేష్ తెలిపారు. బంగ్లాలో భారీగా అక్రమ పనులు చేపట్టినట్లు యోగి ప్రభుత్వం ఆరోపించడం సరికాదని అఖిలేశ్ అన్నారు. ``అది ప్రభుత్వ బంగ్లా. అక్కడ ఎలాంటి అక్రమ కట్టడాలు లేవు. అన్ని అనుమతులను లక్నో డెవలప్ మెంట్ అథారిటీ, ఇతర ఏజెన్సీల నుంచి పొందాను`` అని అఖిలేష్ చెప్పారు. బంగ్లా ఖాళీ చేసే సమయంలోనే అన్ని ఎన్‌వోసీలను తాము చూపించామని ఆయన తెలిపారు. ``ఓ కేబినెట్ మంత్రి మాత్రం బంగ్లా తిరిగి ఇచ్చేయాల్సిందిగా నాకు లేఖ రాశారు. ఆయనకు రాజ్ నాథ్ సింగ్ - కల్యాణ్ సింగ్ ల ఇళ్లు నచ్చలేదు. కేవలం నా ఇల్లే నచ్చింది. దీనిని బట్టే బంగ్లాలో ఎవరు కూల్చివేతలు జరిపారో అర్థం చేసుకోవచ్చు`` అని అఖిలేష్ అన్నారు.